
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్ష బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడివారు అక్కడే ఉండాలని ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నగర పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి రోడ్లను మూసివేశారు. అలాగే కాచిగూడ రైల్వేస్టేషన్ పట్టాలపై నీరు నిలిచాయి. హైటెక్ సిటీ అంతా జలమయం అయింది. గచ్చిబౌళి నుంచి హెచ్‌సీయూ వెళ్లే దారిలో భారీ వర్షపు నీరు చేయింది. నిజాంపేటతో పాటు బండారి లే అవుట్ వరద నీటితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రోడ్లను మూసివేసి రెండు రోజులు సెలవులు ప్రకటించేశారు.