
రామగుండం పరిధిలోని సింగరేణి బొగ్గుగని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు బొగ్గు పెల్లల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వకీల్‌పల్లి బొగ్గు గని 66 లెవెల్‌లో 41డీప్ వద్ద గురువారం సాయంత్రం జంక్షన్ కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది. అయితే స్థానిక అధికారుల ద్వారా ముగ్గురు కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురు గల్లంతైనట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యం విశ్లేషిస్తోంది.