
శామిర్‌పేటకు చెందిన సయ్యద్ యూసఫ్, గౌసియాల కుమారుడు అధియాన్‌తో అదే ఇంట్లో ఓంటున్న బీహార్‌కు చెందిన వ్యక్తి షేర్‌చాట్ స్కిట్ చేశాడు. ఈ సమయంలో అధియాన్ పమాదవశాత్తూ మృతి చెందాడు. అయితే ఆ డెడ్‌బాడీని మూట కట్టి అక్కడి నుంచి తీసుకెళ్లి ఔటర్‌రింగ్‌రోడ్డు పక్కన పడేశాడు. ఆ తరువాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నారు. మృతదేహాన్ని ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి స్వాధీనం చేసుకున్నారు.