
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 922 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,40, 970 ఉండగా.. మృతుల సంఖ్య 1,348గా ఉంది. ప్రస్తతం రాష్ట్రంలో 17,630 యాక్టివ్ కేసులు ఉండగా, 2, 40, 970 లక్షల మంది కోలుకున్నారు. కాగా 14,717 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో రికవరీ రేటు 92.12 శాతం ఉండగా, దేశంలో 91.6 శాతంగా ఉంది