తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 491 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,78,599 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,499గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,69,828 మంది కోలుకోగా ప్రస్తుతం 7,272యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 5,169 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 48,005 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన టెస్టుల సంఖ్య 62,05,688గా ఉంది.