
తెలంగాణలో కరోనా కేసులు ముందుకు వెనుకకు సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకరోజు తగ్గినట్టే తగ్గి మరో రోజు ఊహించని విధంగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన ప్రకారం 25 గంటల్లో 2,239 కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనాతో మరణించారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,83,866 కేసులు కాగా 1091 మంది మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉండగా నిన్న ఒక్కరోజే 2,021 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.