
తెలంగాణ రాష్రంలో గడిచిన 24 గంటల్లో 2,214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1,93,600 కేసులు నమోదు కాగా 1135 మంది మరణించారు. ప్రస్తుతం 29,058 యాక్టివ్ కేసులు ఉండగా వారిలో 23,702 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న ఒక్కరోజే 2,474 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.