తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తీపి కబురు అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమిలో శిక్షణ పొందిన 1162 ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో 20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,428 మంది ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రభుత్వం సైతం పోలీస్ శాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయిస్తుందన్నారు.