
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,421 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,29,001 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,298గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,07,326 మంది కోలుకోగా ప్రస్తుతం 20,337 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 17,214 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.