
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ అనారోగ్యంతో మృతి చెందారు. కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన నిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం కుదుపడిందన్న వార్తలు వచ్చినా మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 2009లో బెల్లంపల్లి ఎమ్మెల్యేగా సీపీఐ తరుపున గెలుపొందారు. ఇప్పటికీ ఆయన సీపీఐలోనే కొనసాగుతున్నారు. ఆయన మృతికి వామపక్ష నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.