
హైదరాబాద్ లోని గాజులరామారం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస గౌడ్ అభ్యర్థిత్వాన్ని స్క్రూటీలో డిస్ క్వాలిఫై చేసే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో కూన శ్రీనివాసగౌడ్ ఆందోళనకు దిగారు. అభ్యర్థి అడ్డకేట్ ను కూడా అనుమతించడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. టీఆర్ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను చెదరగొట్టే ప్రయత్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా రేవంత్ రెడ్డి సంఘటనాస్థలానికి చేరుకోవడానికి బయలు దేరారు.