
మహబూబాబాద్ జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన బాలుడు హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం నుంచి బాలుడు సురక్షితంగా ఉన్నట్లు వార్తలు వచ్చినా మహబూబాబాద్‌కు 5 కిలోమీటర్ల దూరంలో బాలుడి మృతదేహం లభించింది. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్‌కు చెందిన దీక్షిత్‌రెడ్డి అనే బాలుడు గత ఆదివారం సాయంత్రం అపహరణకు గురయ్యాడు. సోమవారం మధ్యాహ్నం బాలుడి తల్లికి ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేసిన అగంతకుడు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఐటీకోర్, సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దీంతో గురువారం పోలీసులు దీక్షిత్ జాడను తెలుసుకున్నట్లు వార్తలు వచ్చినా బాలుడి మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.