Xiaomi 14 CIVI: వామ్మో ఫీచర్లు మామూలుగా లేవుగా.. ఇంతకీ ధర ఎంతో తెలుసా?

Xiaomi 6.55 ఇంచ్ పరిమాణం కలిగి ఉంది. AMOLED డిస్ ప్లే అందిస్తుంది. 1.5 K రిజల్యూషన్ తో సరికొత్త అనుభూతిని ఇస్తుంది. స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, HDR 10, HDR 10+, Dolby vision సపోర్ట్ చేస్తుందని xiaomi చెబుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 14, 2024 9:41 am

Xiaomi 14 CIVI

Follow us on

Xiaomi 14 CIVI: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రారాజుగా వెలుగొందాలంటే ఏ కంపెనీ అయినా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేవాలి. వినియోగదారుల మనసు దోచుకోవాలి. సరిగ్గా ఇలాంటి ఫీచర్లనే xiaomi కంపెనీ తన 14 CIVI మోడల్ స్మార్ట్ ఫోన్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకీ ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే.

ఈ స్మార్ట్ ఫోన్ లో Leica ప్రొఫెషనల్ కెమెరా సెట్ అప్ ఉంది.. .. ఈ ఫోన్ ను డ్యూయల్ టోన్ కలర్ లో డిజైన్ లో లభ్యమవుతుంది. మూడు కలర్స్ ఆప్షన్ కూడా లభిస్తుంది.. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్(8 GB + 256 GB) ని రూ..42,999 కి విక్రయించనుంది.. రెండవ వేరియంట్ ( 12 GB + 512 GB) పై రూ. 47,999 ధరను ప్రకటించింది. ఈ ఫోన్ జూన్ 20 నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ముందస్తు ఆర్డర్ ను xiaomi మొదలుపెట్టింది.

Xiaomi 6.55 ఇంచ్ పరిమాణం కలిగి ఉంది. AMOLED డిస్ ప్లే అందిస్తుంది. 1.5 K రిజల్యూషన్ తో సరికొత్త అనుభూతిని ఇస్తుంది. స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, HDR 10, HDR 10+, Dolby vision సపోర్ట్ చేస్తుందని xiaomi చెబుతోంది.. ఇవే కాక 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో కనులకు కనువిందు చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు Hi- Res ఆడియో, వైర్లెస్, dolby atmos సపోర్టు తో ఈ ఫోన్ సరికొత్తగా ఉంది.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8s Gen 3 చిప్ సెట్ ఈ ఫోన్ కు ఉన్న ప్రధాన ఆకర్షణ. 12 GB LPDDR5x RAM, 512 GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోన్లో మంచి కనెక్టివిటీ కోసం అనేక మార్పులు చేశారు. ఇంటర్నెట్ కోసం ప్రత్యేకమైన T1 సిగ్నల్ అనౌన్స్మెంట్ చిప్ ను కూడా జోడించింది. Xiaomi 14 CIVI మోడల్ లో 4700 mAh బ్యాటరీ, 67W టర్బో చార్జింగ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది.. ఈ ఫోన్ ముందు భాగంలో ఆటో ఫోకస్ సపోర్ట్ ఉన్న 32 MP+ 32 MP(అల్ట్రావైడ్) సెల్ఫీ కెమెరా సెట్ అప్ ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన portrait ఫోటోలతో పాటు, ultrawide తో గ్రూప్ సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు.. ఈ ఫోన్లో లైకా ప్రొఫెషనల్ కెమెరా సెట్ అప్ ఉంది. 50 ఎంపీ+ ప్లస్ 50 ఎంపీ టెలిఫోటో+ 12 ఎంపీ ఆల్ట్రా వైడ్ సెన్సార్ లు ఈ ఫోన్ కు ఉన్న మరో ఆకర్షణ. ఇందులో 4k మాస్టర్ సినిమా మోడ్ లో 10 బిట్ HLG వీడియోను రికార్డ్ చేయవచ్చు.. ఇవి మాత్రమే కాదు అనంతమైన లైకా కెమెరా ఫిల్టర్లు, ఇతర ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

లాంచింగ్ ఆఫర్స్ కింద..

Xiaomi లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ ఫోన్ తో పాటు ₹3000 ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందిస్తోంది. అలాగే ₹3000 బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ కూడా ప్రకటించింది.. ICICI, HDFC బ్యాంకు ల క్రెడిట్ కార్డ్స్ ఉన్నవారికి ఈ సదుపాయం లభిస్తుంది.