Windows 11 users good news: ప్రస్తుతం కాలంలో కంప్యూటర్ వాడే చాలా మంది విండోస్ 11 ఓఎస్ ఇన్ స్టాల్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అప్డేట్స్కు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. విండోస్ 11 అప్డేట్ కోసం నిర్ణీత గడువును విధించి.. ఆ సమయంలో చేసుకోకపోనే అనేక సాంకేతిక సమస్యలు ఎదురయ్యేవి. ఈ సమస్యలను గుర్తించిన మైక్రోసాఫ్ట్ కొత్త మార్పులు చేసింది. దీంతో యూజర్లకు గొప్ప ఉపశమనం కలిగినట్లయింది. ఇంతకీ మైక్రోసాఫ్ట్ చేసిన ఆ మార్పులు ఏవో చూద్దాం..
Windows 11 వాడకం వల్ల కొన్ని పనులు వేగవంతంగా అయ్యేవి. అంతేకాకుండా కొత్త కొత్త యాప్స్ ఇన్ స్టాల్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. అయితే ఎప్పటికప్పుడు విండోస్ 11 ను అప్డేట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ దీని అప్డేట్స్ పెండింగ్‌లో ఉంటే తీవ్ర సమస్యలు ఎదుర్కొనేవారు. యూజర్లు ఒకవేళ అప్డేట్ చేయకపోతే పీసీ రీస్టార్ట్ అవుతూ ఇబ్బంది పెట్టేది. చాలా మంది యూజర్లకు ఇది చికాకు తెప్పించేది. ఈ విషయాలపై మైక్రోసాఫ్ట్ యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ గ్రహించింది. దీనిని ఆధారంగా చేసుకుని, అప్డేట్ మేనేజ్మెంట్లో పెద్ద మార్పులు తీసుకొచ్చింది.
సరైన సమయంలో విండోస్ అప్డేట్ చేసుకోలేకపోతే గరిష్ఠంగా 35 రోజుల వరకు మాత్రమే వాయిదా వేసుకునే వీలుండేది. కానీ ఇకప్పుడు ఆ 35 రోజుల పీరియడ్ ముగిసిన తర్వాత.. మళ్లీ వాయిదా పొడిగించుకోవచ్చు. ప్రతి 35 రోజులకు ఒకసారి ఇలా పొడిగించుకుంటూ, మీకు సౌకర్యంగా ఉన్నంత కాలం (అన్ని రోజులు కూడా!) అప్డేట్ను ఆలస్యం చేసుకోవచ్చు. ఇది ఫీచర్ అప్డేట్స్ కు మాత్రమే వర్తిస్తుంది. చిన్న సెక్యూరిటీ అప్డేట్స్కు కాదు.
అప్డేట్ విషయంలో మరో కీలక ఫీచర్‌గా క్యాలెండర్ ఇంటిగ్రేషన్ వచ్చింది. అంటే ఫలాన తేదీల్లో అప్డేట్ చేసుకుంటాను అని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అందుకోసం సెటింగ్స్ లోకి వెళ్లి విండోస్ అప్డేట్.. ఆ తరువాత అడ్వాన్స్డ్ ఆప్షన్స్‌లోకి వెళ్లి, “సెట్ డిఫర్రల్ తేదీ” ఆప్షన్ సెలెక్ట్ చేసి క్యాలెండర్లో ఒక తేదీని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, “మే 15న అప్డేట్ చేస్తాను” అని సెట్ చేస్తే.. ఆ తేదీ వరకు ఆటోమేటిక్ అప్డేట్ జరగదు. దీనివల్ల పని బిజీగా ఉన్న రోజుల్లో ఇబ్బంది పడకుండా, వీకెండ్ లేదా సౌకర్యవంతమైన రోజున అప్డేట్ చేసుకోవచ్చు.
ఈ మార్పులు ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. సెట్టింగ్స్ (Win + I) తెరిచి, Windows Update > Advanced optionsకి వెళ్లండి. అక్కడ ‘Feature update deferral period’ ‘Target specific date’అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ పీసీ Windows 11 24H2 వెర్షన్లో ఉంటే మాత్రమే ఇవి పూర్తిగా పని చేస్తాయి . చెక్ చేయడానికి Win + R నుంచి winver టైప్ చేయండి. ఇది సెక్యూరిటీని కాపాడుతూ యూజర్ సౌలభ్యాన్ని పెంచుతుంది. ఈ అప్డేట్ మేనేజ్మెంట్ మార్పులతో విండోస్ 11 యూజర్లు తమ పీసీలను మరింత సౌకర్యవంతంగా నడపవచ్చు. మైక్రోసాఫ్ట్ ఫోరమ్‌లు మరియు యూజర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇంకా మెరుగులు తీసుకొస్తోంది
