
మైక్రోసాఫ్ట్ విండోస్ 11 పేరుతో విండోస్ కొత్త వెర్షన్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వెర్షన్ ను అదిరిపోయే ఫీచర్లతో తీసుకొస్తామని విండోస్ 11 చాలారోజుల నుంచి చెబుతుండగా విండోస్ 11 ఫీచర్లు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సాధారణంగా స్టార్ట్ మెనూ ఎడమవైపు ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే విండోస్ 11లో మాత్రం స్టార్ట్ మెనూను సెంటర్ కు తెచ్చారు. స్టార్ట్ బటన్ ను నొక్కిన వెంటనే స్క్రీన్ సెంటర్ లో యాప్ లిస్ట్ పాప్ అప్ అవుతుంది.
క్రోమ్ ఓఎస్, మ్యాక్ ఓస్ లో స్టార్ట్ బటన్ ఓపెన్ చేయగానే ఇదే విధంగా జరుగుతుందనే సంగతి తెలిసిందే. విండోస్ 10లో ఐకాన్లు స్టార్ట్ మెనూ ఓపెన్ చేసిన తర్వాత ఆటో ప్లే కావడం జరుగుతుంది. కొత్త ఓఎస్ లో మాత్రం లైవ్ టైల్స్ కు బదులుగా రౌండెడ్ కార్నర్స్ తో యాప్ ఐకాన్స్ ను తీసుకొచ్చారు. విండోస్ 11 ఓఎస్ లో స్నాప్ లే అవుట్స్ స్టైల్ ను తీసుకొస్తున్నారు. స్నాప్ లే అవుట్స్ ద్వారా యాప్స్, ఫోల్టర్, సాఫ్ట్ వేర్ లను ఇష్టానుసారం అరేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మల్టీ టాస్కింగ్ చేసేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విండోస్ 11 ఓఎస్ లో ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్స్ లో ఉన్నటువంటి సెర్చ్ డాక్యుమెంట్ ఫీచర్ ను తెచ్చారు. యాప్స్, సాఫ్ట్ వేర్లతో పాటు డాక్యుమెంట్లు కూడా కనిపిస్తాయి. మైక్రోసాఫ్ట్ 365 యూజర్లకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. విండోస్ కంప్యూటర్లలో అప్ డేట్ లు వచ్చిన సమయంలో సిస్టమ్ నాలుగైదు సార్లు రీస్టార్ట్ అవుతుంది.
విండోస్ 11లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ లోనే అప్ డేట్లు అయిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. హెచ్.డీ.ఆర్ ఫీచర్ ఉండటం వల్ల ఎక్స్ బాక్స్ లో గేమ్ ఆడేవాళ్లకు ఉపయుక్తంగా ఉంటుంది. విండోస్ 11లో అమెజాన్ యాప్ స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ ఆధారిత యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి విండోస్ 11 అందుబాటులోకి వస్తుంది.
విండోస్ 10 యూజర్లకు ఉచితంగానే విండోస్ 11 అప్ డేట్ చేయడం జరుగుతుంది. జెన్యూన్ విండోస్ 10ను వాడుతుంటే మాత్రమే ఉచితంగా అప్ డేట్ చేస్తారు. కొత్తగా విండోస్ 11ను ఇన్ స్టాల్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఫ్రీ స్టోరేజ్ ను కలిగి ఉండి కనీసం 1 జీ.హెచ్.జెడ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉంటే విండోస్ 11 ఓఎస్ ను ఇన్ స్టాల్ లేదా అప్ డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.