https://oktelugu.com/

Facebook Twitter : ఫేస్ బుక్, ట్విట్టర్ కథ ముగిసినట్టేనా.. ప్రస్తుత పరిణామాలు ఏం చెబుతున్నాయి?

Facebook Twitter : రెండు దశాబ్దల క్రితం మై స్పేస్ . కామ్ అని ఒక సైట్ ఉండేది.. దీనికి 30 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు.. అయితే, ఫేస్ బుక్ రాకతో ఇది మరుగున పడింది. ఇప్పుడు ఇది ఆన్ లైన్ కమ్యూనిటీ గ్రూపులు, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ గా మాత్రమే పనిచేస్తోంది. ప్రస్తుతం దీనికి 60 లక్షల మంది వినియోగదారులు మాత్రమే ఉన్నారు. గతంలో ఆర్కుట్ అనే పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఉండేది.. […]

Written By:
  • Rocky
  • , Updated On : November 23, 2022 / 09:43 PM IST
    Follow us on

    Facebook Twitter : రెండు దశాబ్దల క్రితం మై స్పేస్ . కామ్ అని ఒక సైట్ ఉండేది.. దీనికి 30 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు.. అయితే, ఫేస్ బుక్ రాకతో ఇది మరుగున పడింది. ఇప్పుడు ఇది ఆన్ లైన్ కమ్యూనిటీ గ్రూపులు, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ గా మాత్రమే పనిచేస్తోంది. ప్రస్తుతం దీనికి 60 లక్షల మంది వినియోగదారులు మాత్రమే ఉన్నారు. గతంలో ఆర్కుట్ అనే పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఉండేది.. గూగుల్ మద్దతుతో ఇది పాపులర్ అయింది.. 2014లో ఫేస్ బుక్ విజృంభణ తో ఇది కూడా చరిత్రలో కలిసిపోయింది. నేటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల పరిస్థితి కూడా ఇదేనా? ఫేస్ బుక్, ట్విట్టర్ మనుగడ కొనసాగిస్తాయా? ఉద్యోగులను ఉన్నఫలంగా తొలగిస్తే గతంలో మాదిరి సేవలు అందిస్తాయా? ఇందుకు సంబంధించి నిపుణులు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

     

     

    భారీ మొత్తంలో కోల్పోయాయి.

    ఏడాదిగా దిగ్గజ టెక్ సంస్థలైన యాపిల్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా( ఫేస్ బుక్ మాతృ సంస్థ), ఆల్ఫాబెట్ ( గూగుల్ మాతృ సంస్థ) లకు చెందిన మూడు ట్రిలియన్ డాలర్లు దాదాపు 244 లక్షల కోట్ల వరకు సంపద మార్కెట్ నుంచి ఆవిరి అయింది. నవంబర్లో అమెజాన్ తో పాటు చాలా టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల కోతలు ప్రకటించాయి. ఈనెల 21 నాటికి మొత్తంగా 1,36,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.. భారీగా ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా మొదటి వరుసలో ఉంది. ఈ సంస్థ ఇప్పటివరకు 11 వేల మందిని ఇంటికి పంపింది. వైపు ట్విట్టర్ కూడా తమ ఉద్యోగుల్లో సగం మందిని అంటే 3,700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

    తట్టుకొని నిలబడగలవా

    ఫేస్ బుక్, ట్విట్టర్ కు దిగ్గజ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు గా పేరు ఉన్నది. అయితే సంక్షోభాలను తట్టుకొని ఈ సంస్థలు నిలబడగలవా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ఇవి ప్రపంచ ఆర్థిక మందగమనం ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. అంటే వ్యాపార లావాదేవీల్లోకి వచ్చే డబ్బు పూర్తిగా తగ్గిపోతున్నది. ప్రకటనలపై సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గిపోతున్నది. సోషల్ మీడియా వేదికలు సాధారణంగా ప్రకటనలపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. అయితే ఆర్థిక మందగమనంతో ఈ ప్రకటనలు పూర్తిగా తగ్గిపోతాయి. ఫలితంగా వీటి మనుగడే అవుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. తాజాగా అక్టోబర్ చివర్లో మెటా ఆర్థిక నివేదిక విడుదల చేసింది. సంస్థ రెవెన్యూ భారీగా తగ్గిపోయినట్టు ప్రకటించింది. దీంతో సంస్థ సమస్యలు మరింత ఎక్కువైపోయాయి. మరోవైపు టిక్ టాక్ లాంటి సంస్థల నుంచి మెటాకు గట్టి పోటీ ఎదురవుతున్నది.

    ట్విట్టర్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు

    ఎలన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ వచ్చిన తర్వాత.. దాని పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. రెవెన్యూ పడిపోవడంతో పాటు మస్క్ నాయకత్వ శైలి, ఆయన తీసుకునే నిర్ణయాలు సంస్థకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.. తరచూ ట్విట్టర్ పయోగించే వారి సంఖ్య మొత్తం వినియోగదారుల్లో 10 శాతం వరకే ఉంది.. కానీ, సంస్థ రెవెన్యూలో 90% ఈ ఖాతాల ట్వీట్ల నుంచే వస్తోంది. మెరుగ్గా వినియోగదారులను పెంచుకునే విషయంలో ట్విట్టర్ విఫలమౌతోంది.. ఇక ఫేస్ బుక్ కు దాదాపు 300 కోట్ల మంది నెలవారి యాక్టివ్ యూజర్లు ఉన్నారు. దీంతో ప్రపంచంలో అతి ఎక్కువమంది ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్ఫారం గా ఇది రికార్డ్ సృష్టించింది.. అయితే గత ఫిబ్రవరిలో 18 ఏళ్ల సంస్థ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా వినియోగదారులను కోల్పోయింది.. ఆ తర్వాత సంస్థ షేర్లు కూడా భారీగా పతనం అయ్యాయి. ప్రస్తుతం యూజర్లు 23.8 కోట్ల మంది ఉన్నారని సంస్థ చెబుతోంది. ఫేస్ బుక్ లో శృంగార సాహిత్యం పెరగడం వల్ల చాలామంది వినియోదారులు, అడ్వర్టైజర్లు సంస్థలు దూరం పెడుతున్నారు.. ఇది అంతిమంగా రెవెన్యూపై ప్రభావం చూపిస్తున్నది. ఇక కోవిడ్, ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడిన పరిస్థితులు మొత్తానికి ఈ దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ఫారాలను కోలుకోకుండా చేస్తున్నాయి. వీటిని నమ్ముకుని ఇన్నాళ్లు పనిచేసిన ఉద్యోగులను నడిబజార్లో కి తోసేశాయి. అయితే మునుముందు పరిస్థితులు చక్క పడతాయా? లేక మరింత దిగజారుతాయా అనేది ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.