https://oktelugu.com/

Whatsapp: వాట్సాప్ సూపర్ ఫీచర్.. మెసేజ్ ను టెక్స్ట్ రూపంలో పంపే అవకాశం! వాట్సాప్ సూపర్ ఫీచర్.. మెసేజ్ ను టెక్స్ట్ రూపంలో పంపే అవకాశం!

Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా మరో సూపర్ ఫీచర్ ను తీసుకురాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం చాలామంది బిజీగా ఉన్న సమయంలో మెసేజ్ ను పంపాలంటే గూగుల్ అసిస్టెంట్ ను వినియోగించుకుంటున్నారు. గూగుల్ అసిస్టెంట్ సహాయంతో వాయిస్ మెసేజ్ ను టెక్స్ట్ గా పంపే అవకాశం ఉండగా వాట్సాప్ తన యూజర్ల కొరకు ఇదే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ ఫీచర్ కు సంబంధించిన టెస్టింగ్ ను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 14, 2021 12:44 pm
    Follow us on

    Whatsapp Workout New Features For Privacy

    Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా మరో సూపర్ ఫీచర్ ను తీసుకురాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం చాలామంది బిజీగా ఉన్న సమయంలో మెసేజ్ ను పంపాలంటే గూగుల్ అసిస్టెంట్ ను వినియోగించుకుంటున్నారు. గూగుల్ అసిస్టెంట్ సహాయంతో వాయిస్ మెసేజ్ ను టెక్స్ట్ గా పంపే అవకాశం ఉండగా వాట్సాప్ తన యూజర్ల కొరకు ఇదే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

    ఇప్పటికే ఈ ఫీచర్ కు సంబంధించిన టెస్టింగ్ ను వాట్సాప్ నిర్వహిస్తోందని సమాచారం. అయితే వాట్సాప్ నుంచి ఈ ఫీచర్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బీటా యూజర్లకు కూడా ఈ ఫీచర్ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం యాపిల్ సంస్థ ఆడియోను ట్రాన్స్ కైబ్ చేసే సర్వీస్ ను ఐఓఎస్ వెర్షన్ లో అందిస్తోంది. వాట్సాప్ యూజర్ల కోసం మరికొన్ని ఫీచర్లను కూడా తీసుకురానుందని తెలుస్తోంది.

    వాట్సాప్ సంస్థ బ్యాకప్ చాట్స్ కు సంబంధించి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ అనే ప్రైవసీ ఫీచర్ ను యాడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూజర్లకు ఈ ఫీచర్ ను వాట్సాప్ ఆప్షనల్ గా అందించనుందని సమాచారం. గూగుల్ డ్రైవ్ లేదా ఐ క్లౌడ్ లో చాటింగ్ హిస్టరీని బ్యాకప్ చేసుకునే యూజర్ల కొరకు వాట్సాప్ ఈ ఫీచర్ ను తీసుకురానుందని తెలుస్తోంది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ వల్ల ఆ మెసేజ్ లను ఎవరూ చూడలేరు.

    ఇప్పటికే బీటా యూజర్లకు బ్యాకప్ చాట్స్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ అందుబాటులో ఉంది. ఇతర యూజర్లకు సైతం ఈ ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.