WhatsApp stopped : వాట్సాప్.. ఇప్పుడు ఇంటి పనుల నుంచి ఆఫీసు పనుల వరకూ అన్ని దాంట్లోనే..బంధాలు, సంబంధాలు, మీటింగ్ లు, కలుసుకోవడాలు, ఫోన్లో చాటింగ్ లు, వీడియోలు అన్నీ దాంతోనే.. అలాంటి వాట్సాప్ లేని మొబైల్ ను.. ఈ ప్రపంచాన్ని మనం ఊహించలేం. కానీ ఆ ఉపద్రవం రానేవచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ‘వాట్సాప్’ ఆగిపోయింది. వాట్సాప్ లేనిదే సగటు మనిషి జీవితం నడవని ఈ పరిస్థితుల్లో ఇది ఆగిపోవడంతో చాలా మంది పని కూడా ఆగిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అయిపోయింది. అన్ని కంపెనీలు, సంస్థల్లో వాట్సాప్ ద్వారానే పనులు సాగుతుంటాయి. మీడియాలోనూ వార్తలు చేరవేయడానికి వాట్సాప్ నే కీలకం. అలాంటి వాట్సాప్ ఆగిపోవడంతో సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్ాసప్ సేవలు ఆగిపోయాయి. చాలా మంది యూజర్లు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ లు చేయలేకపోతున్నారు. పర్సనల్ గా కూడా మెసేజ్ లు వెళుతున్నా.. సింగిల్ టిక్ మాత్రమే వస్తుండడంతో ఏం జరుగుతుందో తెలియక వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. కొందరికి పర్సనల్ మెసేజ్ లు వెళ్లడం లేదు.
వాట్సాప్ ఆగిపోవడం సాంకేతిక సమస్యగా తెలుస్తోంది. సర్వర్ డౌన్ అయినట్టు సమాచారం. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా సారథ్యంలో ‘వాట్సాప్ ’ నడుస్తోంది. మార్క్ జుకెర్ బర్గ్ ఈ సంస్థకు సీఈవోగా చేస్తున్నారు. ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజంగా.. అందరికీ చేదోడువాదోడుగా ఉండే వాట్సాప్ సేవలు ఆగిపోవడంతో అందరూ గగ్గోలు పెడుతున్నారు. టెక్నికల్ సమస్యల కారణంగా నిలిచిపోయిన ఈ సేవలను పునరుద్దరించేందుకు ‘వాట్సాప్’ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.