Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీWhatsApp New Privacy Feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీ ఇకపై ఎలా...

WhatsApp New Privacy Feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీ ఇకపై ఎలా ఉండబోతుందంటే..

WhatsApp New Privacy Feature: వాట్సప్ వాడకం అంతకంతకు పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ యాప్ కు విపరీతమైన ఆదరణ ఉంది. ఓ నివేదిక ప్రకారం దాదాపు 5 బిలియన్ల యూజర్లు ఈ యాప్ వాడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వాలు కూడా వాట్సాప్ ద్వారానే ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ముఖ్యంగా సర్టిఫికెట్లు.. ఇతర ఆన్లైన్ సేవలను దీని ద్వారానే కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏకంగా వాట్సప్ గవర్నెన్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా పౌరులకు కొన్ని రకాల సేవలు అందిస్తోంది.

వాట్సప్ నిర్వహణ దాని పేరెంటింగ్ కంపెనీ మెటా చూసుకుంటూ ఉంటుంది. మెటా ఎప్పటికప్పుడు వాట్సప్ ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. కొత్త కొత్త ఫీచర్లను జత చేస్తూ ఉంటుంది. దీనివల్ల యూజర్లకు ప్రైవసీ.. ఇతర సెక్యూరిటీ వ్యవస్థలు రక్షణగా ఉంటాయి. ఇతర సంస్థల నుంచి పోటీ.. యూజర్ల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మెటా కంపెనీ ఎప్పటికప్పుడు వాట్సప్ ను ఆధునికరిస్తుంది. యూజర్ల ప్రైవసీకి ప్రాధాన్యం కల్పిస్తూ ఉంటుంది.

తాజాగా వాట్స్అప్లో ఒక కొత్త ప్రైవసీ ఫీచర్ ను మెటా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల రక్షణ తమకు ప్రథమ ప్రాధాన్యమని మెటా కంపెనీ స్పష్టం చేసింది. మెటా ఏఐ చాట్ లో వాట్సాప్ ఇన్ కాగ్నిటో మోడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్సనల్ చాట్ కు ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ను ఎక్స్ టెండ్ చేసింది. దీనివల్ల యూసర్లు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో పర్సనల్, ప్రైవేట్ కన్వెర్షన్ జరిపేందుకు అవకాశం ఉంటుంది.. ఇక్కడ ఏం చాట్ చేశారనేది.. యూజర్లకు మినహా.. మిగతా వారికి తెలిసే ఆస్కారం లేదు. చివరికి మెటా ఏఐ కూడా దీనిని యాక్సిస్ చేయలేదు. ఆ సందేశాలు సేవ్ కూడా కావు. వెంట వెంటనే డిసపియర్ అయిపోతూ ఉంటాయి.

ఈ ఫీచర్ వల్ల యూజర్లు సరికొత్త అనుభూతిని పొందవచ్చని మెటా చెబుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. పైగా రెండవ కంటికి తెలియకుండా సమాచారాన్ని సేకరించవచ్చు. అందువల్లే మెటా కంపెనీ ఈ ఫీచర్ తీసుకొచ్చింది. కొన్ని దేశాలలో టెస్టింగ్ దశ విజయవంతంగా పూర్తయిన తర్వాత.. దీనిని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో తీసుకొచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version