https://oktelugu.com/

Bullet Proof: శరీరమంతా ‘బుల్లెట్ ఫ్రూఫ్’ జాకెట్లను ధరిస్తే ఏమవుతుంది?

Bullet Proof Jackets all over Body: ఉగ్రవాదుల దాడులు, యుద్ధ సమయాల్లో సైనికులకు బుల్లెట్ ఫ్రూట్ జాకెట్స్ ధరిస్తారు. శత్రుమూకల దాడుల నుంచి సైనికులను బుల్లెట్ ఫ్రూఫ్ సూట్స్ రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయనే సంగతి అందరికీ తెల్సిందే. అలాంటి బుల్లెట్ ఫ్రూఫ్ సూట్లను సైనికులు శరీరమంతా ధరిస్తే వారికి మరింత రక్షణ కలుగుతుంది? కదా.. మరీ అలా ఎందుకు చేయరు? అన్న సందేహం రాకమానదు.   కానీ సైనికులు కేవలం ఛాతి భాగంలో మాత్రమే […]

Written By:
  • NARESH
  • , Updated On : April 13, 2022 / 12:31 PM IST
    Follow us on

    Bullet Proof Jackets all over Body: ఉగ్రవాదుల దాడులు, యుద్ధ సమయాల్లో సైనికులకు బుల్లెట్ ఫ్రూట్ జాకెట్స్ ధరిస్తారు. శత్రుమూకల దాడుల నుంచి సైనికులను బుల్లెట్ ఫ్రూఫ్ సూట్స్ రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయనే సంగతి అందరికీ తెల్సిందే. అలాంటి బుల్లెట్ ఫ్రూఫ్ సూట్లను సైనికులు శరీరమంతా ధరిస్తే వారికి మరింత రక్షణ కలుగుతుంది? కదా.. మరీ అలా ఎందుకు చేయరు? అన్న సందేహం రాకమానదు.

     

    కానీ సైనికులు కేవలం ఛాతి భాగంలో మాత్రమే ఈ బుల్లెట్ ఫ్రూప్ సూట్లను వాడుతుంటారు? మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లోనే సైనికులు ఇదే మౌలిక సూత్రాన్ని వాడుతున్నారు. మరీ దీని వెనుక కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే..!

    బుల్లెట్ ఫ్రూప్ సూట్లను సాధారణంగా ఓ మెస్తారు పిస్టల్స్, తుపాకుల నుంచి రక్షణ కల్పించేలా తయారు చేస్తారు. పెద్దపెద్ద మిషన్ గన్స్, ఫిరంగులు, గ్రెనేట్స్ తదితర ఆయుధాలను బుల్లట్ ఫ్రూప్ జాకెట్స్ తట్టుకోలేవు. బుల్లెట్ల దాటికి ఈ కవచాలు నాశనం అవుతున్నాయి. వీటిని అలానే ధరిస్తే బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ల బరువుతోపాటు బుల్లెట్ల బరును కూడా మోయాల్సి వస్తోంది.

    మరోవైపు సైనికులు యుద్ధ సమయంలో తమ వెంట దాదాపు 36కిలోల వరకు అదనపు బరువును తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికితోడు పెద్ద మిషన్ గన్స్ బుల్లెట్ల దాడిని ఈ జాకెట్స్ ఏమాత్రం తట్టుకోలేవు. ఈ పరిస్థితుల్లో సైనికులు నాశనమైన బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లను తొలగించాల్సి వస్తుంది. ఇక తల నుంచి శరీరం మొత్తం బుల్లెట్ ఫ్రూప్ సూట్స్ తయారు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది.

    ఖర్చు విషయంలో ప్రభుత్వాలు వెనుకాడుగు వేయకపోయిప్పటికీ భారీ పేలుళ్ల నుంచి ఇవి ఏమాత్రం రక్షణ కల్పించలేవు. దీనికితోడు బుల్లెట్ల ప్రూఫ్ సూట్స్ బరువు పెరగడం వల్ల సైనికులు చురుకుగా యుద్ధ రంగంలో కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సైనికులు శత్రువులు ఈజీగా దొరికిపోయే ప్రమాదం ఉంది.

    ఈ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు ఛాతివరకు ధరించే బుల్లెట్ ఫ్రూప్ సూట్లనే సైనికులకు ఇస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధంలో కూడా సాంకేతికను విరివిగా వినియోగిస్తుండటంతో బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల అవశ్యకత కొంతమేరకే పరిమితం అవుతోంది.