Dangerous Apps: ఇటీవల ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్నాయి. చేయని తప్పుకు శిక్ష అనుభవించినట్లు మన ప్రమేయం లేకుండానే మన ఖాతాలో నుంచి డబ్బులు మాయమవడం చూస్తుంటాం. ఇది ఎలా జరిగిందనే లోపే సదరు మోసగాడు ఉడాయిస్తాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని యాప్ లు మనకు తెలియకుండానే మన ఖాతాల్లోంచి డబ్బులు మాయం చేయడం తెలిసిందే. ఏవో నెంబర్లు చెప్పమని అడగడం దీంతో మనం టకటక చెప్పేయడం వెంటనే మన ఖాతాలో డబ్బు విత్ డ్రా కావడం జరుగుతోంది. ఇలాంటి మోసాలెన్నో చూశాం. అప్రమత్తంగా ఉండటమే శరణ్యం.

ఇలాంటి మోసాలకు పాల్పడే కొన్ని యాప్ ల జోలికి వెళితే మనకు నష్టమే. దీంతో అవి మన ఫోన్ లో ఉండకుండా జాగ్రత్త పడితేనే సరి. లేదంటే మనం ఏదో ఓ సందర్భంలో అందులో ఏ యాప్ నైనా నొక్కితే అంతే సంగతి. మన ఖాతా నుంచి డబ్బులు పోవడం ఖాయం. ఈ క్రమంలో యాప్ ల విషయంలో తగిన శ్రద్ధ కనబరచాలి. ఏదో ఫోన్ ఉందని ఏది పడితే అది నొక్కి కష్టాలు తెచ్చుకోవద్దు. అసలు ఈ యాప్ లు ఉండకుండా చూసుకోవడమే మన ప్రథమ కర్తవ్యం. ఇందుకు గాను మన ఫోన్ లో వీటిని ఉంచకుండా వ్యవహరించాలి.
Also Read: MLA Seethakka: రాష్ట్రపతి ఎన్నికలు : కాంగ్రెస్ కు షాకిచ్చిన సీతక్క.. ఎవరికి ఓటు వేశారో తెలుసా?
వ్లాగ్ స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటివ్ 3డీ లాంచర్, వావ్ బ్యూటీ కెమెరా, గిఫ్ ఇమోజీ కీ బోర్డ్, ఫ్రీ గ్లో కెమెరా, కోకో కెమెరా వి1.1, ఫన్నీ కెమెరా బై కిల్లీ టెక్, రేజర్ కీ బోర్డు, థీమ్ బై చెల్డియాలోల ఈ యాప్ లు మన మొబైల్ లో ఉంటే ముప్పే అని గ్రహించాలి. సాధ్యమైనంత వరకు వీటిని ఫోన్లో ఉండకుండా జాగ్రత్తలు వహించాలి. లేకపోతే అంతే. మన డబ్బులకు గ్యారంటీ లేనట్లే. భవిష్యత్ అంధకారమే. ఈ యాప్ ల విషయంలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందే. అవి మన ఫోన్ లో లేకుండా చేసుకోవడమే మంచి మార్గం.

ఈ ఎనిమిది యాప్ లతో పాటు ఇంకో యాప్ ఉంటుంది. దాని పేరు ఆటో లైకోస్. ఇది మరింత డేంజరస్. మనకు తెలియకుండానే మన ఖాతాల్లోంచి డబ్బులు మాయం చేస్తుంది. దీన్ని ఫ్రాన్స్ కు చెందిన అధ్యయన సంస్థ గుర్తించి గూగుల్ కు తెలియజేయడంతో వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయినా ఆటో లైకోస్ ఫోన్ లో ఉంటే కష్టమే. అందుకే అవి మన ఫోన్ లో ఉంచుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిందే.
Also Read:Pawan Kalyan: పవన్ దూకుడు.. డిఫెన్స్‌లో జగన్ సర్కార్
[…] […]