Miss AI: పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి.. అంటారు పెద్దలు.. మిగతా రంగాల్లో ఏమో కానీ.. శాస్త్ర సాంకేతిక విభాగానికి మాత్రం ఈ సామెత కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవ్వాళ ఉన్నది రేపు ఉండదు. రేపటిది ఎల్లుండికి మారిపోతుంది. మార్పునిత్యం, మార్పు సత్యం, మార్పు శాశ్వతం అంటూ ఉంటాం కదా.. సేమ్ అలా అన్నమాట. ఒకప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పరిధికి మాత్రమే పరిమితం అయిపోయేది. కానీ గత పది సంవత్సరాలల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో సమూల మార్పులు వచ్చాయి. రోబోలు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. స్మార్ట్ ఫోన్లు అత్యవసరం అయిపోయాయి. ఇక ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టంల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఒక ఊపు ఊపుతోంది. చాట్ జిపిటి, జెమిని.. ఈ జాబితాలో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడితోనే ఆగడం లేదు. తాజాగా ఈ విభాగంలో అందాల పోటీలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలను మాత్రమే మనం చూసాం. కానీ చరిత్రలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన అందమైన భామలకు అందాల పోటీలు నిర్వహించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన అందమైన భామలకు మధ్య ఈ పోటీలు జరుగుతాయి. ఈ మేరకు “ఇటీవల వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటర్ అవార్డ్స్” ఒక ప్రకటన చేసింది. దాని ప్రకారం మిస్ ఏఐ పోటీలలో నెగ్గిన విజేతకు 20వేల డాలర్ల బహుమతి అందిస్తారట.
ఈ పోటీలలో ఆర్టిఫిషియల్ డిజైన్స్ క్రియేట్ డివైస్ అందంతో పాటు వీటి తయారీకి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాలలో దాని ప్రభావం.. ఇతర అంశాలను విజేతను ఎంపిక చేసేందుకు పరిగణలోకి తీసుకుంటారట. ఏప్రిల్ 21 నుంచి దరఖాస్తులు ఏప్రిల్ 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందాల పోటీలలో మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. ఈ పోటీలలో నలుగురు న్యాయ నిర్ణేతల ప్యానెల్ లో ఇద్దరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో తయారుచేసిన డివైజ్ లు కావడం విశేషం. ఈ అందాల పోటీలలో విజేతను మే 10 న ప్రకటిస్తారు. ఏప్రిల్ నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందాల పోటీ అవార్డుల వేడుకను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. భవిష్యత్తు కాలం మొత్తం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ దే కావడంతో.. దానిపై అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. కాగా , ఈ తరహా అందాల పోటీలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇవేనా, ఇంకా ఏమైనా ప్లాన్ చేశారా? అంటూ చలోక్తులు విసురుతున్నారు.