https://oktelugu.com/

Rolls Royce EV: దూసుకొస్తున్న రోల్స్‌ రాయిస్‌ ఈవీ.. త్వరలో మార్కెట్‌లోకి..!

Rolls Royce EV: లగ్జరీ కార్ల తయారీలో రోల్స్‌ రాయిస్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఇమేజ్‌ ఉంది. ఈ కంపెనీ ఇటీవలే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. 2023 చివరి నాటికి రోల్స్‌ రాయిస్‌ ఎలక్ట్రిక్‌ కారు ’రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్‌’ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్‌ కారుకు ఇటీవల రెండోసారి టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఫస్ట్‌ టెస్ట్‌డ్రైవ్‌తో పోసిస్తే రెండో డ్రైవ్‌లో ఆ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 30, 2022 3:41 pm
    Follow us on

    Rolls Royce EV: లగ్జరీ కార్ల తయారీలో రోల్స్‌ రాయిస్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఇమేజ్‌ ఉంది. ఈ కంపెనీ ఇటీవలే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. 2023 చివరి నాటికి రోల్స్‌ రాయిస్‌ ఎలక్ట్రిక్‌ కారు ’రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్‌’ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్‌ కారుకు ఇటీవల రెండోసారి టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఫస్ట్‌ టెస్ట్‌డ్రైవ్‌తో పోసిస్తే రెండో డ్రైవ్‌లో ఆ కారులో 40 శాతం అభివృద్ధి సాధించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ టెస్ట్‌ డ్రైవ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    Rolls Royce EV

    Rolls Royce EV

    దక్షిణ ఫ్రాన్స్‌లో టెస్ట్‌ డ్రైవ్‌..

    రోల్స్‌ రాయిల్స్‌ ఈవీ కారును ఆ సంస్థ రెండోసారి ఫ్రెంచ్‌ రివేరా, దక్షిణ ఫ్రాన్స్‌లో 625,000 కిలోమీటర్ల వరకు టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించింది. దీంతో ఇప్పటి వరకు 2.5 మిలియన్‌ కిలోమీటర్ల టెస్ట్‌ డ్రైవ్‌ను పూర్తి చేసింది. ఇక ఈ టెస్ట్‌లో కారులో 40 శాతం అభివృద్ధిని సాధించింది. ఈ సందర్భంగా రోల్స్‌ రాయిస్‌ మోటార్‌ కార్స్‌ సీఈవో టోర్‌స్టెన్‌ ముల్లర్‌ ఓట్వోస్‌ మాట్లాడుతూ.. రోల్స్‌ రాయిస్‌ కారు తరహాలో ఈ కొత్త ఈవీ కారు ఉండదని, వాటన్నింటి కంటే భిన్నంగా ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ వేరియంటే కాకుండా.. కంప్యూటింగ్‌ సామర్ధ్యం, లేటెస్ట్‌ డేటా ప్రాసెసింగ్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ కనెక్ట్‌ చేసిన రోల్స్‌ రాయిస్‌ అని చెప్పారు. అంతేకాదు ఈ కారులో స్టార్ట్‌ రాడ్, ట్రాన్సె్వర్స్‌ రాడ్‌ , కాయిల్‌ స్పింగ్, షాక్‌ అబ్జార్బర్స్, డ్రమ్, కంట్రో ఆర్మ్, డ్రైవ్‌ యాక్సిల్‌ భాగాలను కలిపే సస్పెన్షన్‌ సిస్టం ‘మ్యాజిక్‌ కార్పెట్‌ రైడ్‌’ ఫీచర్లు ఉన్నాయి.

    పిల్లర్‌ లెస్‌ కోచ్‌ డోర్లు..

    రోల్స్‌ రాయిస్‌ సంస్థ దాని చరిత్రలోనే తొలిసారి 1.5 మీటర్ల పొడవైన పిల్లర్‌ లెస్‌ కోచ్‌ డోర్‌లను ఈ ఈ కార్లలో ప్రవేశ పెట్టిందని టోర్‌స్టెన్‌ గుర్తు చేశారు. దాదాపు నాలుగు మీటర్ల పొడవుతో ముందు ఏ పోల్‌ నుంచి వెనుక టెయిల్‌లైట్‌ల వరకు వన్‌ పీస్‌ సైడ్‌ ప్యానల్‌ విస్తరించింది ఉంది. అదేవిధంగా, పిల్లర్‌లెస్‌ కోచ్‌ డోర్లు దాదాపు 1.5 మీటర్ల పొడవుతో రోల్స్‌ రాయిస్‌ చరిత్రలో అత్యంత పొడవైనవి ఈ సందర్భంగా వివరించారు.

    రికార్డు ధర..

    మోటార్‌ కార్లు, ఎలక్ట్రిక్‌ కార్ల ధరల్ని పోల్చితే.. ఈవీ కారు రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్‌ మోస్ట్‌ ఎక్స్‌పెన్సీవ్‌ కారుగా అవతరించనున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. పలు నివేదికల ప్రకారం.. ఈ కారు ధర భారత్‌ కరెన్సీలో రూ.3,86,46,873.07 ఉండగా.. భవిష్యత్‌లో ఈ కారు ధర మరింత పెరిగే అవకాశం ఉండనుందని అంచనా.

    Tags