https://oktelugu.com/

Sivakar Bapuji Talpade : తొలుత విమాన తయారీదారుడు భారతీయుడే.. మన టెక్నాలజీని తొక్కేసిన సామ్రాజ్యవాదులు! 

ప్రపంచపు తొలి విమానంలో మొదటిసారి ప్రయాణించిన వ్యక్తిగా అర్విల్లీ వైట్‌ ఉన్నాడు. ఇతని కంటే ఎనిమిదేళ్ల ముందు సివుకర్‌ బాపూజీ తల్పాడే రూపొందించిన తన మొదటి విమానంలో ప్రయాణించాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 18, 2023 / 04:09 PM IST
    Follow us on

    Sivakar Bapuji Talpade : ప్రపంచంలో తొలుత విమానాన్ని కనుగొన్నది ఎవరు అనగానే టక్కున రైట్‌ సోదరులనే సమాధానం వినిపిస్తుంది. సామ్రాజ్యవాదులు తమకన్నా తెలివైనవారిని ఎదగకుండా.. తొక్కేశారు. తమ మించి ఎవరూ ఎదగకూడదన్న అక్కసు కారణంగా ఎంతోమంది తెలివైనవారు కనుమరుగయ్యారు. అలాగే మొట్టమొదటి విమానాన్ని కనిపెట్టింది రైట్‌ సోదరులు కాదు. తొలి విమాన తయారీదారుడు మన భారతీయుడే. మహారాష్ట్రకు చెందిన సివకర్‌ బాపూజీ తల్పాడే రైట్‌ సోదరులు విమానం కనుగొనడం కంటే ఎనిమిదేళ్లు ముందే విమానం తయారు చేశాడు.

    1895లోనే ఎగిరిన భారతీయ విమానం.. 
    చరిత్ర ప్రకారం.. 1903 డిసెంబర్‌ 17న రైట్‌ సోదరులు ప్రపంచంలోనే మొదటి విమానానని రూపొందించి ప్రయోగించారు. యంత్రం బరువును మించిన గాలిని సృష్టించడం ద్వారా గాలిలోకి ఎగురవచ్చని కనుగొన్నారు. దీని ఆధారంగానే ప్రస్తుతం గాలిలో ఏవియేషన్‌ రంగం నిలబడింది. అయితే రైట్‌ సోదరులు తమ విమానాన్ని ప్రయోగించడానికి సుమారుగా ఎనిమిదేళ్ల ముందే అనగా 1895లో భారతీయుడు సివకర్‌ బాపూజీ తల్పాడే ప్రపంచపు తొలి విమానాన్ని రూపొందించాడు. ఇతను సంస్కృత పండితుడు. సివకర్‌ బాపూజీ మరుసక్తి అనే పేరుతో విమానాన్ని తయారు చేశాడు. వేదాల్లోని సూత్రాల ఆధారంగా దీనిని రూపొందించారు. నాడు ఏవియేషన్‌ టెక్నాలజీ లేదు. ప్రాచీన సాంస్కృతిక గ్రంథాల్లో రూపొందించిన వేద పరిజ్ఞానం ఆధారంగా బాపూజీ తల్పాడే ఈ మొదటి విమానాన్ని రూపొందించారు.
    ముంబై తీరంలో ప్రయోగం..
    భారీ జనసందోహం ముందు ముంబయిలోని చౌపతి తీరంలో బాపూజీ తల్పాడే తొలి విమానాన్ని విజయవంతంగా నడిపి చూపించారు. రైట్‌ సోదరులు నిర్మించిన మొదటి విమానం 120 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించిందని.. తొలిసారి విమానంలో ప్రయాణించిన వ్యక్తిగా ఆర్విల్లీ రైట్‌ నిలిచాడు. కానీ బాపూజీ సివుకర్‌ బాపూజీ రూపొందించిన విమానం సుమారు 1,500 అడుగుల ఎత్తుకు ఎగిరింది. ఈ విషయాన్ని అప్పట్లో ప్రముఖ వార్తా పత్రిక కేసరి న్యూస్‌ పేపర్‌ ఈ కథనాన్ని ప్రచురించింది. రైట్‌ బ్రదర్స్‌ను అమెరికా పాలకులు సన్మానిస్తే.. నాడు భారతదేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్‌వాళ్లు పనికిమాలిన టెక్నాలజీ అని అవమానించారు.
    పాండిత్యాన్ని అవపోసన పట్టి.. 
    సివకర్‌ బాపూజీ తల్పాడే భారతీయ సంస్కృత పండితులు. చిన్నతనం నుంచే పాండిత్యమంటే తల్పాడేకు చాలా ఇష్టం. సంస్కృతంలోని వైమానిక శాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నాడు. చారిత్రక పత్రాల ఆధారంగా వైమానిక శాస్త్రం, దాని సాంకేతికత గురించి సంస్కృతంలో వివరించాడు. అందులో పరిజ్ఞానం ఆధారంగానే నాసా ఆయాన్‌ యంత్రాన్ని అభివృద్ధి చేసిందనే రూమర్స్‌ ఉన్నాయి.
    అయాన్‌ ఇంజిన్‌ రూపొందించిన బాపూజీ.. 
    శివకర్‌ బాపూజీ చిన్నతనం నుంచే అత్యంత ప్రతిభాశాలి. 30 ఏళ్ల వయసులోనే అతను పీహెచ్‌డీ పూర్తిచేశాడు. తర్వాత విమానాల తయారీపై పరిశోధన చేస్తున్న సుబ్బరాయశాస్త్రితో పరిచయం పెంచుకున్నాడు. మొదటి విమానం క్రాష్‌ అయిన తర్వాత సివకర్‌ మెర్క్యురీ అయాన్‌తో ఇంజిన్‌ను తయారు చేశాడు. మెర్క్యుటీ ప్రభావంతో ఆయన మానసికంగా దెబ్బతిన్నాడు. మతిమరుపు కూడా వచ్చింది. దీంతో నాటి బ్రిటిషర్లు సివకర్‌ టెక్నాలజీని తిరస్కరించారు. పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నారని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. తర్వాత తయారు చేయకూడదనే ఒప్పందంతో విడుదల చేశారు. కానీ ప్రసుత్తం విమాన తయారీలో అయాన్‌ మెర్క్యురీ టెక్నాలజీనే వాడుతున్నారు.
    రుక్క విమానం తయారు. 
    జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా సివకర్‌ బాపూజీ విమానాల తయారీ ఆపలేదు. గోపురం, బెల్‌ను పోలిన రుక్క విమానం తయారు చేశారు. దీనిని జర్మనీకి తరలించి అక్కడ మరింత సాంకేతిక పరిజ్ఞానంతో ఎగిరేలా తయారు చేశాడు. భారతీయ సంస్కృతిలో కూడా విమాన టెక్నాలజీని తలపించే నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే ఉన్నాయి. కానీ మన సివకర్‌ బాపూజీకి గుర్తింపు రాలేదు. రైట్‌ సోదరులే వెలుగులోకి వచ్చారు. జాత్యహంకారం, వివక్ష, భారతీయుల ఆధిపత్యాన్ని అంగీకరించని సామ్రాజ్యవాదుల కారణంగా సివకర్‌ టెక్నాలజీ కనుమరుగైంది. చివరకు ఆయన గుండెపోటుతో మరణించారు.
    ప్రధానంగా 1800–1900 మధ్యకాలంలోనే సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. ఆ కాలంలో ప్రయోగదశలో ఉన్న ఆవిస్కరణలను ఇప్పుడు పలు అసరాలకు ఉపయోగించుకుంటున్నాం. ఆ శతాబ్దకాలంలో అనేక దేశాలు విమానాల మీద తీవ్ర ప్రయోగాలు చేశాయి. ప్రపంచపు తొలి విమానంలో మొదటిసారి ప్రయాణించిన వ్యక్తిగా అర్విల్లీ వైట్‌ ఉన్నాడు. ఇతని కంటే ఎనిమిదేళ్ల ముందు సివుకర్‌ బాపూజీ తల్పాడే రూపొందించిన తన మొదటి విమానంలో ప్రయాణించాడు.