Beast: ప్రతిభ కలిగి ఉండి కొంచెం పెట్టుబడి పెడితే యూట్యూబ్ లో రాణించొచ్చు. ఈ రంగంలో దిగిన వారు కొద్ది కాలంలోనే కోటీశ్వరులైన వారున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ యూట్యూబ్ ను వీక్షిస్తున్నారు. వారికి అనుగుణంగా చాలా మంది వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. అయితే అప్లోడ్ చేసిన ప్రతీ వ్యక్తి రాణిస్తారని చెప్పలేం. కానీ కొందరు మాత్రం కోట్ల కొద్దీ సబ్ స్క్రైబర్లను తెచ్చుకొని లాభాల పంట పండిస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం అమెరికాకు చెందిన ఓ వ్యక్తి యూ ట్యూబ్ లో అత్యధిక వ్యూహర్ షిప్ ఉన్నట్లు తేలింది. దాదాపు 112 మిలియన్ సబ్ స్క్రైబర్స్ అంటే 11 కోట్లకు పైగా అతని ఛానెల్ ను ఫాలో అవుతున్నారు.
Beast
అమెరికాకు చెందిన జిమ్మీ డోనాల్డ్స్ ‘బీస్ట్’ పేరుతో ఛానల్ ను ఓపెన్ చేశాడు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న స్క్విడ్ గేమ్స్ సిరీస్ ను రిక్రీయేట్ చేసి తన ఛానెల్ లో అప్లోడ్ చేశాడు. తాను రీక్రియేట్ చేసిన వీడియోలకు చాలా మంది ఫిదా అయ్యారు. దీంతో ఆయన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటూ వెళ్లారు. ఇలా 111.9 మిలియన్ల మంది జిమ్మీ చానెల్ ను ఫాలో అవుతున్నారు. అంతకుముందు యూట్యూబ్ లో రారాజుగా కొనసాగుతున్న స్వీడన్ కు చెందిన ఫెలిక్స్ అర్వింద్ ఉల్ప్ జెల్ బర్గ్ ని వెనక్కి నెట్టేశాడు.
అంతేకాదు 2021లో ప్రపంచంలోనే యూట్యూబ్ ద్వారా అత్యధిక ఆదాయం పొందిన వ్యక్తిగా జిమ్మి పేరొందాడు. అయితే జిమ్మి యూట్యూబ్ వీడియోలు చేయడమే కాకుండా మిస్టర్ బీస్ట్ బర్గర్ అనే ఓ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నాడు. అత్యధిక సబ్ స్క్రైబర్స్ ను తెచ్చుకున్న జిమ్మినీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్లు ఉన్న మన ఇండియన్ చానెల్ కూడా హవా సాగిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘టీ సీరిస్’ 229 మిలియన్లతో లీడ్ కొనసాగిస్తోంది.
Beast
1998 మే 7న జన్మించిన జమ్మి అమెరికాలోని విచిష్ట లోజన్మించాడు. ఈయన ‘మిస్టర్ బీస్ట్ ’ అనే చానెల్ నేకాకుండా దానికి అనుబంధంగా ‘బీస్ట్ ఫిలంత్రోఫీ’, ‘మిస్టర్ బీస్ట్ గేమింగ్’, ‘మిస్టర్ బీస్ట్’ షాట్స్ అనే తదితర ఛానెల్స్ ను రణ్ చేస్తున్నారు.