ప్రముఖ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ కొత్త కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. స్టాక్ ఉన్నంత వరకు లేదా జులై 31వ తేదీలోపు ఈ కార్లను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ కార్లను కొనుగోలు చేయడం ద్వారా అత్యధికంగా 65,000 రూపాయల వరకు ప్రయోజనం చేకూరనుంది. టాటా 5 సీటర్ హారియర్ వెర్షన్ ను కొనుగోలు చేయడం ద్వారా ఈ మొత్తం డిస్కౌంట్ ను పొందవచ్చు.
ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కింద 40,000 రూపాయలు, కన్జ్యూమర్ స్కీమ్ కింద 25వేల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని వేరియంట్లపై మాత్రమే 40,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుందని తెలుస్తోంది. నెక్సాన్ సబ్ కాంటాక్ట్ వెహికిల్ ను కొనుగోలు చేయడం ద్వారా ఏకంగా 15,000 రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. డీజిల్ వెర్షన్ వాహనాన్ని కొనుగోలు చేయడం ద్వారానే ఈ మొత్తాన్ని పొందవచ్చు.
టిగారో సబ్ కాంపాక్ట్ సెడాన్ పై 30,000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మొత్తంలో 15,000 రూపాయలు ఎక్స్ ఛేంజ్ బోనస్ కాగా 15,000 రూపాయలు కన్జ్యూమర్ డిస్కౌంట్ గా ఉంది. టియాగో హ్యాచ్ బ్యాక్ పై 25,000 రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే టాటా మోటార్స్ సఫారీ, అల్టురోజ్ కార్లపై మాత్రం ఎటువంటి డిస్కౌంట్ ను ఇవ్వకపోవడం గమనార్హం.
టాటా మోటార్స్ కంపెనీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఆఫర్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు వెంటనే సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించి కారును కొనుగోలు చేస్తే మంచిది.