https://oktelugu.com/

Top 10 Cars in India 2022: ఇండియాలో జోరుగా కార్ల అమ్మకాలు.. భారీగా అమ్ముడైన టాప్10 కార్లు ఎవో తెలుసా?

Top 10 Cars in India 2022: దేశంలో సంపన్న వర్గం పెరిగిపోతోంది. ఫలితంగా సౌకర్యవంతమైన వాహనాల విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాల్లో రికార్డుల మోత మోగుతోంది. గత కొద్ది రోజులుగా కార్ల అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోంది. ఫలితంగా కంపెనీలకు లాభాల పంట పండుతోంది. సంపద పెరిగితే సదుపాయాలు కూడా పెరుగుతాయి. దీంతో దాని ద్వారా వచ్చే ఆదాయంతో విలువైన వస్తువుల కొనుగోలుకు కూడా ప్రజలు మొగ్గు చూపుతారు. వ్యాపారరంగం పుంజుకుంటుంది. కంపెనీలకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 12, 2022 / 05:19 PM IST
    Follow us on

    Top 10 Cars in India 2022: దేశంలో సంపన్న వర్గం పెరిగిపోతోంది. ఫలితంగా సౌకర్యవంతమైన వాహనాల విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాల్లో రికార్డుల మోత మోగుతోంది. గత కొద్ది రోజులుగా కార్ల అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోంది. ఫలితంగా కంపెనీలకు లాభాల పంట పండుతోంది. సంపద పెరిగితే సదుపాయాలు కూడా పెరుగుతాయి. దీంతో దాని ద్వారా వచ్చే ఆదాయంతో విలువైన వస్తువుల కొనుగోలుకు కూడా ప్రజలు మొగ్గు చూపుతారు. వ్యాపారరంగం పుంజుకుంటుంది. కంపెనీలకు మంచి గిరాకీ కలుగుతుంది.

    Top 10 Cars in India 2022

    హ్యుందాయ్ వెన్యూ వ్యాపారంలో దూసుకుపోతోంది. జూన్ 2021లో 10,321 యూనిట్ల విక్రయాలతో పదో స్థానంలో నిలిచింది. వాస్తవానికి జూన్ 2021లో హ్యుందాయ్ వెన్యూ 4865 విక్రయాలు మాత్రమే విక్రయాలు జరిపింది. 112 శాతం మేర అమ్మకాలు పెరిగినా టాప్ టెన్ స్థానం దక్కలేదు. నెలవారీ విక్రయాల పరంగా చూస్తే 14వ స్థానంలో నిలిచింది.

    Also Read: NTR- Koratala Siva: సెకండ్ హాఫ్ పై ఎన్టీఆర్ అసంతృప్తి..అయోమయం లో పడిన కొరటాల శివ

    Hyundai Venue

    టాటా పంచ్ 10,414 యూనిట్లు విక్రయించి తొమ్మిదో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం వృద్ధి రేటు పంచ్ కు లేదు. విక్రయాలు చేయలేదు. దీంతో పంచ్ అమ్మకాల సంఖ్య తగ్గినా గత నెలలో నిర్వహించిన అమ్మకాలతో రెండు స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలవడం గమనార్హం. గత నెల అమ్మకాల్లో మారుతి సుజికి ఎర్టిజా ఎనిమిదో స్థానంలో నిలిచింది. 10,423 యూనిట్ల అమ్మకాలతో టాటా పంచ్ ను అధిగమించింది. అమ్మకాలు లేకపోవడంతో ఆరో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది.

    Tata Punch

    మారుతి సుజికి డిజైర్ కూడా వ్యాపారంలో దూసుకుపోతోంది. తన అమ్మకాలను పెంచుకుంటోంది. జూన్ 2022లో 12,597 యూనిట్ల అమ్మకాలు సాగినట్లు తెలుస్తోంది. మే నెలలో 11,603 యూనిట్లు విక్రయించి ఎనిమిదో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇక మారుతి ఆల్టో 13,970 యూనిట్లు అమ్మకాలు జరిపి ఆరోస్థానంలో నిలిచింది. మే 2022లో 12,933 యూనిట్లు విక్రయించి 6.5 శాతం వృద్ధిరేటు నమోదు చేసుకుంది. దీంతో వ్యాపార రంగంలో మారుతి ఆల్టో వేగంగా వెళ్తోంది.

    Maruti Suzuki Dzire

    హ్యుందాయ్ క్రెటా జూన్ 2021లో 9,943 యూనిట్లు విక్రయించి వ్యాపారరంగంలో 39 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంది. జూన్ 2022లో 10,973 యూనిట్లు విక్రయించి 25 శాతం వృద్ధిరేటు పెంచుకుంది. ఇది వ్యాపారంలో ఐదో స్థానంలో నిలిచింది. టాటా నెక్సాన్ కూడా వ్యాపారంలో తనదైన శైలిలో వృద్ధి రేటు నమోదు చేస్తోంది. జూన్ 2022లో 14,295 యూనిట్లు విక్రయించి తనదైన జోరు కొనసాగించింది. దీంతో 78 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుని తనకెదురు లేదంటూ నిరూపిస్తోంది.

    Hyundai Creta

    మారుతి సుజుకి స్విఫ్ట్ వ్యాపారంలో మరింత దూకుడుగా ఉంటోంది. 16,213 యూనిట్లు విక్రయాలు చేసి ఏకంగా 14 శాతం వృద్ధి రేటు సంపాదించుకుంది. మారుతి వేగనార్ కూడా అనూహ్యంగా అమ్మకాలు పెంచుకుంది. జూన్ 2022లో 19,190 యూనిట్లు విక్రయించి 14 శాతం వృద్ధి రేటు తెచ్చుకుంది. దీంతో కార్ల కంపెనీలు తమ అమ్మకాల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తూ అమ్మకాలు జోరుగా సాగిస్తున్నాయి. ఫలితంగా వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించుకుంటున్నాయి.

    Maruti Swift

    Also Read:Prashanth Neel – NTR: పాకిస్థానీగా నటిస్తున్న ఎన్టీఆర్.. ఇది ఇండియాకే గర్వకారణం

    Tags