Boat Smart Watch: వైర్లెస్ హెడ్ ఫోన్స్, బ్లూటూత్ నెక్ బ్యాండ్, ఇతర డిజిటల్ ఉపకరణాలకు పేరుపొందిన బోట్ కంపెనీ.. సరికొత్త స్మార్ట్ వాచ్ ను తెరపైకి తీసుకువచ్చింది. ప్రస్తుతం యువత స్మార్ట్ వాచ్ ల వాడకం పట్ల విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కేవలం సమయం కోసం మాత్రమే కాకుండా ఫోన్ కాలింగ్, హెల్త్ ట్రాక్, ఇతర ఫీచర్లను ఇష్టపడుతున్నారు. యువత ఇష్టానికి అనుగుణంగా చాలా కంపెనీలు రోజుకో తీరుగా ఫీచర్లు యాడ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీల నుంచి మీడియం రేంజ్ కంపెనీల వరకు స్మార్ట్ వాచ్ లు సందడి చేస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ వాచ్ లను రూపొందిస్తుండడంతో యువత అత్యంత ఇష్టంగా కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో బోట్ కంపెనీ తీసుకొచ్చిన స్మార్ట్ వాచ్ గేమ్ చేంజర్ లాగా ఉందని చెబుతున్నారు టెక్ నిపుణులు. స్ట్రోమ్ కాల్ 3 పేరుతో ఈ వాచ్ ను బోట్ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇంతకీ దీని విశేషాలేంటంటే..
ఈ వాచ్ గుండ్రని, దీర్ఘ చతురస్రాకార మోడల్స్ లో ఈ వాచ్ లభిస్తోంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, నావిగేషన్ సపోర్ట్ ఉంది. పిక్సెల్ రిజల్యూషన్ 240*296 గా ఉంది. నిట్స్ బ్రైట్ నెస్ 550 గా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేందుకు ఇందులో ఎస్ ఓ ఎస్ మోడ్ యాడ్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో ముందస్తుగా ఎంట్రీ చేసిన కాంటాక్ట్ లకు సమాచారం అందించడం ఈ వాచ్ ప్రత్యేకత. దీని బ్యాటరీ సామర్థ్యం 230 ఎం ఏ హెచ్. సింగిల్ చార్జింగ్ తో ఏడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని బోట్ కంపెనీ చెబుతోంది.
ఈ వాచ్ లో హెల్త్ ట్రాకర్ ఉంది. గుండె కొట్టుకునే వేగం, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లిప్ సైకిల్ ట్రాకర్ వంటివి ఇందులో ఉన్నాయి. 700 ప్లస్ ఫ్రీ ఇన్ స్టార్ట్ యాక్టివిటీ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఇది సిల్వర్ మెటల్, ఓలీవ్ గ్రీన్, డార్క్ బ్లూ, యాక్టివ్ బ్లాక్, చెర్రీ బ్లోసం వంటి వేరియెంట్స్ లో లభిస్తోంది. దీన్ని ప్రారంభ ధర 1,099.. సిల్వర్ మెటల్ వేరియంట్ ధర 1,249, ఇక మిగతా వేరియంట్ల ధరలు 1,588 నుంచి 1,694 మధ్యలో ఉన్నాయి. యూత్ ను దృష్టిలో పెట్టుకొని బోట్ కంపెనీ ఈ వాచ్ లను రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బ్లూటూత్ హెడ్ సెట్, ఇతర డిజిటల్ ఉపకరణాల తయారీలో నెంబర్ వన్ సంస్థగా ఉన్న బోట్.. స్ట్రోమ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో ప్రవేశపెట్టడం ద్వారా.. ఈ రంగంలోనూ నెంబర్ వన్ గా ఎదగాలని భావిస్తోంది.