SIM Free Technology: అప్పట్లో వచ్చిన ఓ సినిమాలో మెడికల్ మాఫియా గురించి ప్రముఖంగా చూపించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలకు మందులు బయటికి రాకుండా ఫార్మా మాఫియా ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో అందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాల నివారణకు మందులు అందుబాటులోకి వస్తే.. ఆసుపత్రులు నడవవు. రోగాలు నయం అవుతాయి కాబట్టి ఫార్మా కంపెనీలకు కొంతవరకు మాత్రమే గిరాకీ ఉంటుంది. రోగం తగ్గిపోతే మందులు వాడాల్సిన అవసరం రోగులకు ఉండదు. అప్పుడు ఫార్మా కంపెనీలకు గిరాకీ ఉండదు. అందువల్ల అలాంటి మందులను బయటికి రాకుండా ఫార్మా కంపెనీలు తొక్కి పెడుతున్నాయి అనేది ఆ సినిమా ఉద్దేశం. కేవలం ఫార్మా విషయంలోనే కాదు.. చాలా విషయాలలోనూ మాఫియా రాజ్యమేలుతూ ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు ఈ మాఫియాను పోషిస్తూ ఉంటాయి. అందువల్ల ప్రజలకు మందుల నుంచి మొదలు పెడితే టెలికాం సేవల వరకు ప్రతిదీ ఖరీదు గానే ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలు ఆయా విభాగాలలో భారీగా పెట్టుబడులు పెడతాయి. పెట్టిన పెట్టుబడులను రికవరీ చేసుకోవడానికి.. అంతకుమించిన లాభాలను సొంతం చేసుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు అసలు విషయాలను బయటకు రాకుండా తొక్కి పెడుతుంటాయి.
ప్రస్తుతం మన దేశంలో జియో, ఎయిర్ టెల్ వంటివి అతిపెద్ద టెలికాం కంపెనీలుగా కొనసాగుతున్నాయి. గతంతో పోల్చి చూస్తే ఈ కంపెనీలు ఇప్పుడు టారిఫ్ చార్జీలను విపరీతంగా పెంచేశాయి. మొదట్లో జియో యూజర్లను ఆకట్టుకోవడానికి అత్యంత చవక ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇచ్చింది. ఎప్పుడైతే తనకు యూజర్లు పెరిగిపోయారో.. ఒక్కసారిగా రూట్ మార్చేసింది. ప్రతి సేవను ఖరీదు వ్యవహారం లాగా మార్చేసింది. అప్పటిదాకా జియో సేవలను ఉపయోగించిన కస్టమర్లు.. వేరే నెట్వర్క్ వైపు వెళ్లకుండా.. జియోలోనే ఉండిపోవడం మొదలుపెట్టారు. ఖరీదైనప్పటికీ.. దానికి అలవాటు పడి వాడటం మానుకోలేకపోతున్నారు.
Also Read: పాకిస్తాన్‌ను వీడుతున్న మల్టీనేషనల్ కంపెనీలు.. అసలాదేశంలో ఏం జరుగుతోంది!
వాస్తవానికి కార్పొరేట్ కంపెనీల వ్యవహార శైలి అలానే ఉంటుంది. ముందు ప్రజలకు అలవాటు చేస్తారు. అన్ని సేవలను ఉచితంగా కల్పిస్తారు. కొన్ని సేవలను అత్యంత తక్కువ ఖరీదుకు అందేలా చూస్తారు. ఎప్పుడైతే యూసర్లు అలవాటు పడ్డారో.. అప్పుడే ధరలు పెంచుతారు. ఆ తర్వాత ఇన్నాళ్లపాటు ఉచితంగా ఇచ్చిన సేవలపై కూడా ఏదో ఒక రకంగా పన్నులు విధిస్తారు. దీనినే కార్పొరేట్ మాయాజాలం అంటారు..
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ సందడి చేస్తోంది. ఆ పోస్టు ప్రకారం భారత్లోకి ఈ ఫోన్ కనుక వస్తే జియో నుంచి మొదలు పెడితే ఎయిర్టెల్ వరకు అన్ని కంపెనీలు గల్లంతవుతాయని ఆ పోస్ట్ సారాంశం. నమిబియా ప్రాంతానికి చెందిన 29 సంవత్సరాలు యువకుడు ప్రపంచంలోనే సిమ్ లేకుండా ఫోన్ తయారు చేశాడు. దీనికి నెట్వర్క్ అవసరం లేదు. డాటా తో సంబంధం లేదు. వైఫై ఉపయోగించాల్సిన కర్మ లేదు. బ్లూటూత్ పెట్టుకోవలసిన అగత్యం లేదు. కేవలం రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ఆధారంగానే ఒక ఫోన్ మరొక ఫోన్ కు కనెక్ట్ అవుతుంది. అప్పుడు కాల్ చార్జీలు ఉండవు. రోమింగ్ అనేది ఉండదు. డెడ్ జోన్ అనే సమస్య ఉండదు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. అయితే ఇలాంటి టెక్నాలజీ కనుక ఇండియాలోకి వస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ టెలికాం కంపెనీలు తమ దుకాణాలను మూసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి టెక్నాలజీ మనదాకా వస్తుందా? ఈ కార్పొరేట్ కంపెనీలో రానిస్తాయా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వాలను నడిపిస్తున్న క్రమంలో.. ఇటువంటి టెక్నాలజీ మనదేశంలోకి రావడం సాధ్యం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేట్ కంపెనీల మాయాజాల ముందు ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి రావని వారు స్పష్టం చేస్తున్నారు.
