Smartphone Battery: మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం ఫోన్ కాదు, అదో ప్రపంచం. కానీ ఎంత మంచి ఫోన్ అయినా, బ్యాటరీ త్వరగా అయిపోతే చిరాకు వస్తుంది. చాలామంది బ్యాటరీ లైఫ్ పెంచడానికి పాత కాలం నాటి చిట్కాలనే ఇప్పటికీ పాటిస్తుంటారు. కానీ, ఇప్పుడు ఫోన్‌లు పూర్తిగా మారిపోయాయి, వాటి బ్యాటరీ టెక్నాలజీ కూడా మారిపోయింది. అందుకే, మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు రావాలంటే పాత అలవాట్లు వదిలేసి, కొత్త చిట్కాలు పాటించాలి. అవేంటో సింపుల్‌గా ఈ వార్తలో చూసేద్దాం.
Also Read: గౌతమ్ గంభీర్ చూస్తుండగానే.. కోచ్ మీద పడి టీమిండియా ప్లేయర్ల కొట్లాట.. షాకింగ్ వీడియో
గతంలో ఫోన్‌లో యాప్స్ ఓపెన్ చేసి అలాగే వదిలేస్తే బ్యాటరీ ఖర్చవుతుందని క్లియర్ చేసేవారు. కానీ ఇప్పుడున్న కొత్త ఆండ్రాయిడ్ , ఐఓఎస్ ఫోన్‌లలో, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్ ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. మీరు పదేపదే యాప్స్‌ను క్లియర్ చేస్తే, మళ్ళీ వాటిని ఓపెన్ చేసినప్పుడు ఎక్కువ బ్యాటరీ ఖర్చవుతుంది. కాబట్టి, ఇకపై యాప్స్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు.
అలాగే ఫోన్‌ను ఎక్కువసేపు ఛార్జ్ చేస్తే బ్యాటరీ పాడైపోతుందని చాలామంది భయపడతారు. కానీ ఇప్పుడు వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు ఓవర్‌ఛార్జింగ్‌ను నివారించే టెక్నాలజీతో వస్తున్నాయి. 100శాతం ఛార్జ్ అయిన తర్వాత అవి నెమ్మదిగా ఛార్జ్ అవ్వడం లేదా ఛార్జింగ్‌ను ఆపేయడం చేస్తాయి. కాబట్టి, ఓవర్‌ఛార్జింగ్ గురించి ఆందోళన పడనవసరం లేదు. బ్యాటరీని పూర్తిగా ఖాళీ చేసి (0%) ఛార్జ్ చేయకపోతే దాని కెపాసిటీ తగ్గుతుందని ఒకప్పటి నమ్మకం. నికెల్-కాడ్మియం బ్యాటరీలకు ఇది నిజం కావచ్చు, కానీ ఇప్పుడు వస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీలకు ఈ సమస్య లేదు. మీరు ఎప్పుడైనా, ఎంత శాతం ఉన్నప్పుడైనా మీ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.
బ్యాటరీ లైఫ్ పెంచడానికి అసలు సిసలు చిట్కాలు ఇవే!
స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి: మీ ఫోన్ బ్యాటరీలో ఎక్కువ భాగం స్క్రీన్ బ్రైట్‌నెస్ వల్లే ఖర్చవుతుంది. బ్రైట్‌నెస్‌ను తగ్గించడం లేదా ఆటో బ్రైట్‌నెస్ ఆన్ చేయడం మంచిది.
డార్క్ మోడ్ వాడండి: మీ ఫోన్‌లో డార్క్ మోడ్ లేదా డార్క్ థీమ్ ఉంటే దాన్ని ఆన్ చేయండి. ముఖ్యంగా అమోలెడ్ స్క్రీన్ ఉన్న ఫోన్‌లలో డార్క్ మోడ్ బ్యాటరీని బాగా ఆదా చేస్తుంది.
డేటా వాడకంలో జాగ్రత్త: మీకు అవసరం లేనప్పుడు 5G/4G డేటాను 2G/3Gకి మార్చండి. 5G/4G ఎక్కువ బ్యాటరీని లాగుతుంది. అలాగే, అనవసరంగా వైఫై, బ్లూటూత్, జీపీఎస్ ఆన్‌లో ఉంచకండి.
నోటిఫికేషన్లు, వైబ్రేషన్ తగ్గించండి: మీకు అవసరం లేని యాప్స్ నుండి వచ్చే నోటిఫికేషన్స్, వైబ్రేషన్, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్(టచ్ చేసినప్పుడు వచ్చే వైబ్రేషన్) ఆపరేషన్లను ఆఫ్ చేయండి.
బ్యాటరీ సేవర్ మోడ్: మీ ఫోన్ ఛార్జింగ్ శాతం తగ్గినప్పుడు బ్యాటరీ సేవర్ లేదా లో-పవర్ మోడ్‌ను ఆన్ చేయండి. ఇది సీపీయూ పనితీరును తగ్గించి బ్యాటరీ ఎక్కువసేపు వచ్చేలా చేస్తుంది.
అప్‌డేట్‌లు తప్పనిసరి: మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను, మీరు వాడే యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి. అప్‌డేట్‌లలో బ్యాటరీ పనితీరును మెరుగుపరిచే మార్పులు ఉంటాయి.
రీస్టార్ట్ చేయండి: అప్పుడప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల అనవసరంగా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే ప్రోగ్రామ్స్ క్లియర్ అయ్యి ఫోన్ పనితీరు, బ్యాటరీ లైఫ్ మెరుగుపడతాయి.
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే, ఈ ఆధునిక చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. టెక్నాలజీ మారిన కొద్దీ, మన వినియోగ అలవాట్లు కూడా మారాలి. ఈ చిన్న చిన్న మార్పులతో మీ ఫోన్ బ్యాటరీని ఎక్కువసేపు ఉపయోగించుకోవచ్చు.