Samsung Galaxy Z Fold : 4జీ నుంచి 5జీ నెట్ వర్క్ మారిన నేపథ్యంలో చాలా మంది మొబైల్స్ అప్డేట్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఫోల్డబుల్ ఫోన్స్ కూడా మారుస్తున్నారు. మొబైల్ రంగంలో బ్రాండెడ్ కంపెనీ అయిన శ్యాంసంగ్ నుంచి లేటేస్టుగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, ఫ్లిఫ్ 5 స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. వీటిని ఆగస్టు 18న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ప్రాథమికంగా వీటి ఫీచర్స్ అన్లైన్లో ఉంచినా.. ధర విషయంలో చాలా మందికి అయోమయంగానే ఉంది. అయితే తాజాగా ఈ కంపెనీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం..
శ్యాంసంగ్ నుంచి ప్రకటించిన జెడ్ ప్లిఫ్5 తో పాటు జెడ్ ఫోల్డ్ 5లపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. జూలై27 తేదీ నుంచి దీని బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. దీంతో ఇప్పటికే చాలా మంది బుక్ చేసుకున్నారు. శ్యాంసంగ్ ఫోల్డ్ 4 తో పోలిస్తే ఫోల్డ్ 5 చాలా భిన్నంగా కనిపిస్తుంది. గెలాక్సీ ఫోల్డ్ 5 చాలా తేలికంగా ఉంటుంది. ఇది 13.4 మిల్లీ మీటర్ల మందంతో 253 గ్రాములు మాత్రమే ఉంది. ఫోన్ ఫోల్డ్ చేసే విధానం కూడా కొత్తగా కనిపిస్తుంది. ఎలాంటి శబ్దం లేకుండా ముడుచుకుంటుంది.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 పీచర్స్ విషయానికొస్తే 512 జీబీ స్టోరేజిని కలిగి ఉంది. ప్రారంభ ధ రూ.1,64,999గా నిర్ణయించారు. ఇందులో టాప్ ఎండ్ జెడ్ ఫోల్డ్ 5 వేరియంట్ ధర రూ.1,84,999తో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ ఏరియంట్ ఐసీ బ్లూ రంగులో మాత్రమే లభిస్తుంది. ఇక జెడ్ ఫోల్డ్ 5 కోనుగోలు చేసేవారికి రూ.23 వేల క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కలిగిస్తుంది. వీటిలో రూ.10 వేల 512 జీబీ స్టోరేజ్ అప్ గ్రేడేషన్, రూ.5 వేల అప్ గ్రేడ్ బోనస్, రూ.8 వేల క్యాష్ బ్యాక్ ఉన్నాయి.
గెలాక్సీ జెడ్ ప్లిఫ్ 256 జీబీ స్టోరేజీతో పనిచేస్తుంది. దీనిని రూ.99,000తో విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించిన మరో వేరియంట్ రూ.1,09,999 తో విక్రయిస్తున్నారు. ఈ రెండు వేరియంట్లు మింట్, గ్రాఫైట్, లావెండర్ క్రీమ్ కలర్లో పొందవచ్చు. గెలాక్సీ ప్లిఫ్ 5 కొనుగోలు చేసేవారికి రూ.20 వేల క్యాష్ బ్యాక్ ప్రయోజనాలున్నాయి. ఈ రెండు కూడా 9 నెలల నో కాస్ట్ తో ఈఎంఐ ఆప్షన్ ను కేటాయించారు.