Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్. ఈ డుగ్గు డుగ్గు బుల్లెట్ బ్రాండ్ ఇప్పుడు భారత మార్కెట్లో అవధులు లేకుండా వేగంగా విస్తరిస్తూ వెళ్తుంది. ఈ బ్రాండ్ పట్ల పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ వివిధ రకాల వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా కొత్త బైక్ లను లాంచ్ చేస్తోంది. ఆధునిక టెక్నాలజీతో నేటి యువతరాన్ని కూడా ఆకట్టుకుంటోంది. కొత్త హంటర్ 350 నే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. మరి ఈ బుల్లెట్టు బండి సంగతి ఏమిటో తెలుసుకుందాం రండి.
ముందుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 డిజైన్ గురించి తెలుసుకుందాం. హంటర్ 350 అనేది మీరు వినే కొత్త పేరు మాత్రమే, ఇందులోని పరికరాలన్నీ పాతవే. ఇందులో ఉపయోగించిన ఫ్రేమ్, విడిభాగాలు, ఫీచర్లు మరియు ఇంజన్ అన్నీ కూడా ప్రస్తుత ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ మోటార్‌సైకిళ్ల (క్లాసిక్ 350 మరియు మీటియోర్ 350) నుండి సేకరించబడినవే. కంపెనీ చెబుతున్నట్లుగా హంటర్ 350 సరికొత్త మోటార్‌సైకిల్ కావచ్చు, అయితే ఇది కొన్ని మార్పులు మినహా రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ప్రధాన డిజైన్ లాగే ఉంది.
Also Read: Chicken: చికెన్ తింటున్నారా? ఒకసారి ఆలోచించండి?
ఈ హంటర్ 350లో చెప్పుకోవాల్సిన మరొక విలక్షణమైన డిజైన్ ఫీచర్ ఏంటంటే, దాని ఇంధన ట్యాంక్. దీనికి ఇరువైపులా ఉండే క్రీజ్ లైన్స్ రైడర్ కు మంచి థై సపోర్ట్ ను అందించాయి. ఇక ఈ బైక్ లో చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే.. సింగిల్ పీస్ సీట్. ఈ ఒక్క సీట్ కారణంగా ఇది చూడగానే స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ గా కనిపిస్తుంది. అలాగే, దాని వెనుక భాగం కూడా గుండ్రటి లైట్లతో చాలా సింపుల్ గా, ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది. అన్నిటికీ కంటే ముఖ్యంగా ఇది పాత డుగ్గు డుగ్గు శబ్ధం కన్నా చాలా వినసొంపుగా ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 – స్పెసిఫికేషన్‌లు
ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో అదే పాత 349సీసీ, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన J సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ సింగిల్-సిలిండర్ ఇంజన్ 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి శక్తిని మరియు 27 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా హంటర్ 350కి సంబంధించిన యాక్సిలరేషన్ గణాంకాలను వెల్లడించనప్పటికీ, ఇది గరిష్టంగా గంటకు 114 వేగాన్ని అందుకోగలదని మాత్రం పేర్కొంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 – ప్లస్‌లు, మైనస్‌లు
• దీని 800 మిమీ సీట్ హైట్ కారణంగా, కాస్తంత పొట్టిగా ఉండే రైడర్లు కూడా దీనిని సులువుగా హ్యాండిల్ చేయగలరు.
• ఇది రైడ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. వేగం మరియు మూలల్లో మంచి హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది.
• దీని ఛాస్సిస్ బాగా ట్యూన్ చేయబడింది మరియు హార్డ్ బ్రేకింగ్ కింద సస్పెన్షన్ డైవ్ కాదు.
• హంటర్ 350 మిడ్-రేంజ్‌లో మరియు వేగాన్ని పెంచుతున్నప్పుడు ఎగ్జాస్ట్ నోట్ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది.
• మీరు ఫ్యూయల్ ట్యాంక్‌కు దగ్గరగా కూర్చుని రైడింగ్ చేసే స్టైల్‌ని కలిగి ఉంటే, మీరు కొంత ట్యాంక్ వైబ్రేషన్ ఫీల్ అవుతారు.
Also Read:Senior Heroines: రేసులోకి సీనియర్ హీరోయిన్లు.. పోటీ రసవత్తరం.. చివరకు నిలిచేది ఎవరు ?