Homeబిజినెస్Realme 16 Pro: అరచేతిలో ఫీచర్ల పర్వం.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంతో తెలుసా?

Realme 16 Pro: అరచేతిలో ఫీచర్ల పర్వం.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంతో తెలుసా?

Realme 16 Pro: భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు దుమ్ము రేపుతున్నాయి. కొత్త కొత్త మోడల్స్ తెరపైకి తీసుకొస్తూ యూజర్ల మనసును దోచుకుంటున్నాయి. అద్భుతమైన ఫోన్లను ఆవిష్కరిస్తూ అదరగొడుతున్నాయి. ఇందులో రియల్ మీ (Realme) అనే కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) అనే మోడల్ ను తెరపైకి తీసుకొచ్చింది.

రియల్ మీ 16 ప్రో ను జనవరి 6న మనదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్లో 1.5 K రిజల్యూషన్ ఉంది. అమోలెడ్ డిస్ ప్లే, 144hz రీ ఫ్రెష్ రేట్, Samsung HP 5 sensor, 2000 MP loma colour primary camera, a n t u t score 9.7, థర్మల్ కంట్రోల్ కోసం air flow VC కంట్రోల్ సిస్టం వంటి సదుపాయాలు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల విషయానికి వస్తే Vibe master mode (21 పోర్ట్రేట్ టోన్స్), AI edit Genie వంటి ఫీచర్లు ఉన్నాయి.

వీడియో పరంగా చూసుకుంటే 4K HDR వీడియో రికార్డింగ్ ( 1X, 2X) కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో mediatech dimensity 7300- Max 5G చిప్ సెట్ ఉంది. AnTuTu స్కోరు 9.7 లక్షలకు పైగా ఉంది. ఇందులో 7000 mAh టైటాన్ బ్యాటరీ ఉంది. బ్యాటరీ పెద్దగా ఉన్నప్పటికీ అత్యంత స్లిమ్ డిజైన్ ను ఈ కంపెనీ రూపొందించింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లాంగ్ లైఫ్ బ్యాటరీ చిప్, సూపర్ పవర్ షేవింగ్ మోడ్ ఇందులో ఒక భాగంగా ఉంది. Realme UI 7.0 (flux engine) తో పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏఐ ఫీచర్లు, ఏఐఫ్రేమింగ్ మాస్టర్, ఏఐ రికార్డింగ్, గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్ వంటివి ఇందులో ఉన్నాయి. ధర విషయంలో ఈ కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్ Flipkart, realme.com, ఇతర ఆఫ్లైన్ స్టోర్లలో లభ్యమవుతుంది.

డిజైన్ పరంగా చూసుకుంటే ఇండస్ట్రియల్ డిజైనర్ Naoto Fukasawa తో కలిసి urban wild design కాన్సెప్ట్ ను ఉపయోగించారు. మాస్టర్ గోల్డ్, పేబుల్ గ్రే , ఆర్చిడ్ పర్పుల్ వంటి రంగులు అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్లో IP 69 dust, water resistance rating కూడా అందుబాటులో ఉంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular