https://oktelugu.com/

Rapid Rail: దేశంలోనే మొదటి ర్యాపిడ్ రైల్ పిక్స్ వైరల్

Rapid Rail: దేశంలోనే మొదటి ర్యాపిడ్ రైల్ ఫొటోలు బయటకు వచ్చాయి. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో 82 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 55 నిమిషాల్లో చేరుకునే భారతదేశపు మొదటి ర్యాపిడ్ రైలు ఫస్ట్ లుక్‌ను నేషనల్ క్యాపిటల్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్( ఎన్.సీ.ఆర్.టీసీ) ఆవిష్కరించింది. రాబోయే ఆర్ఆర్టీసీ రైళ్లలో 2×2 ట్రాన్స్‌వర్స్ సీటింగ్, ఓవర్‌హెడ్ లగేజీ రాక్‌లు, సీసీ టీవీ కెమెరాలు, ల్యాప్‌టాప్/మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రతి సీటు వద్ద సాకెట్లు ఇతర సౌకర్యాలతో అద్భుతమైన […]

Written By:
  • NARESH
  • , Updated On : March 17, 2022 / 09:13 AM IST
    Follow us on

    Rapid Rail: దేశంలోనే మొదటి ర్యాపిడ్ రైల్ ఫొటోలు బయటకు వచ్చాయి. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో 82 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 55 నిమిషాల్లో చేరుకునే భారతదేశపు మొదటి ర్యాపిడ్ రైలు ఫస్ట్ లుక్‌ను నేషనల్ క్యాపిటల్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్( ఎన్.సీ.ఆర్.టీసీ) ఆవిష్కరించింది. రాబోయే ఆర్ఆర్టీసీ రైళ్లలో 2×2 ట్రాన్స్‌వర్స్ సీటింగ్, ఓవర్‌హెడ్ లగేజీ రాక్‌లు, సీసీ టీవీ కెమెరాలు, ల్యాప్‌టాప్/మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రతి సీటు వద్ద సాకెట్లు ఇతర సౌకర్యాలతో అద్భుతమైన మౌళిక వసతులతో ప్రజలను విమానం ఎక్కిన ఫీలింగ్ కలిగేలా దీన్ని రూపొందించారు.

    Rapid Rail

    ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైల్ కారిడార్‌లో ఉపయోగించే కోచ్‌లను ఎన్.సీ.ఆర్టీసీ ఈరోజు ఆవిష్కరించింది. అద్భుతమైన పికప్ తో కూడిన ఈ సెమీ హై-స్పీడ్ ఏరోడైనమిక్ ట్రైన్‌సెట్‌లు రాబోయే నెలల్లో ప్రారంభమవుతాయి. సావ్లీలోని తయారీ కేంద్రం మొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్) కారిడార్ కోసం మొత్తం 210 భోగీలను డెలివరీ చేస్తుంది. ఇది ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో ప్రాంతీయ రవాణా సేవలను నిర్వహించడానికి.. మీరట్‌లో స్థానిక రవాణా సేవల కోసం వినియోగిస్తారు. ఈ సంవత్సరం, ఎన్సీఆర్టీసీ ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్టీసీ కారిడార్ ట్రయల్ రన్‌లను ప్రారంభించనుంది.

    Also Read: Liquor Policy AP: మద్యంపై ఏపీ సర్కారు ‘థియరీ’ సామాన్యులకు అర్థమయ్యేనా?

    ఆర్ఆర్టీఎస్ అనేది మొదటి-రకం వ్యవస్థ. ఈ విభాగపు రైళ్లు గంటకు 180 కి.మీ వేగంతో వెళతాయి. ప్రతి 5 – 10 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ మరియు మీరట్ మధ్య దూరాన్ని 55 నిమిషాల్లో 14 స్టాప్ లతో కవర్ చేస్తాయి.

    ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్ సంవత్సరానికి ~2,50,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రైలు అత్యంత శక్తి-సమర్థవంతమైన భవిష్యత్తు రవాణా వ్యవస్థగా నిరూపించబడుతోంది. ఇది అన్ని ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ కొత్త శకాన్ని ఆవిషఊ్కరిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్ట్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది.

    మొత్తం 82-కిమీల పొడవైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌ పూర్తి కావచ్చింది. ఇందులో దుహై & మోడీపురంలో 2 డిపోలు, జంగ్‌పురా వద్ద 1 స్టాబ్లింగ్ యార్డ్‌తో సహా మొత్తం 25 స్టేషన్లు ఉంటాయి.

    *దేశంలోని మొదటి ఆర్ఆర్టీఎస్ ట్రైన్‌సెట్‌లలోని ప్రత్యేకతలు..
    అధిక వేగంతో గాలికి ఎదురు దిశలోనూ ఈ రైలు వేగాన్ని పెంచేలా పొడవైన ముందు బాగాన్ని ముక్కులా డిజైన్ చేశారు. ప్లగ్-ఇన్-డోర్‌లతో ఏరోడైనమిక్ ప్రొఫైల్ కలిగి ఉంది.

    Also Read: Wine Shops Closed In Hyderabad: మందు బాబులకు షాక్.. రెండు రోజులు వైన్స్ బంద్

    ప్రయాణీకులకు ప్రవేశం.. నిష్క్రమణ కోసం గరిష్ట స్థలం కోసం విస్తృత గ్యాంగ్‌వేలతో పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ బోగీలను ఏర్పాటు చేశారు. లేతరంగుతో కూడిన పెద్ద విండో గ్లాసెస్ వెలుపలి దృశ్యాలను చూసేలా అద్భుతంగా తీర్చిదిద్దారు.

    Rapid Rail