Payment Technology Trips: ఆర్థిక వ్యవహారాలు జరిపేందుకు అందరూ ఇప్పుడు డిజిటల్ వైపు మళ్ళుతున్నారు. చేతిలో మొబైల్ ఉంటే క్షణాల్లో డబ్బును ప్రపంచంలో ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది. మొబైల్లో ఉన్న వివిధ రకాల యాప్ ల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. గతంలో ఇంటర్నెట్ బ్యాంకు ద్వారా ఆర్థిక వ్యవహారాలు జరిపిన చాలామంది ఇప్పుడు యూపీఐ పేమెంట్ కు అలవాటు పడ్డారు. కూరగాయల కొనుగోలు జరిపే సమయంలో చెల్లించే బిల్లు నుంచి.. పెద్ద మొత్తంలో డబ్బు పంపడానికి యూపీఐ ప్రధానంగా నిలుస్తుంది. అయితే ఎంత డబ్బు పంపించాలన్న మొబైల్ తో పాటు అందులో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇప్పుడు మొబైల్ లేకుండా కేవలం అరచేతితో మాత్రమే డబ్బులు పంపించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూడండి..
Also Read: ఇంజిన్ సామర్థ్యాన్ని హార్స్ పవర్స్‌లోనే ఎందుకు కొలుస్తారో తెలుసా?
కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో చైనా దేశం ముందు ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల సాఫ్ట్వేర్లు.. యాప్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా మనీ ట్రాన్సాక్షన్ విషయంలో అప్డేట్ వాలెట్ ను ఉపయోగిస్తున్నారు. ఎందుకు సంబంధించి ఓ వ్యక్తి వీడియోను అప్లోడ్ చేశాడు. ఈ వీడియో ప్రకారం ఆయన ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్లి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత బిల్లు కౌంటర్ వద్దకు వెళ్లి కేవలం తన అరిచేతిని మాత్రమే చూపిస్తాడు. అక్కడ అప్పటికే ఏర్పాటు చేసిన ఒక మిషన్ రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. దానిపై అరచేతిని పెట్టడంతో కంప్యూటర్లో ఆ వ్యక్తికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. దీంతో ఆ వ్యక్తి తన బిల్లును చెల్లింపు చేశాడు.
దీనిని We Chat Pay అని అంటున్నారు. అంటే ఎలాంటి మొబైల్ లేకున్నా.. కేవలం అరచేతి ద్వారానే చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం చైనాలో అభివృద్ధి చెందుతోంది. త్వరలో ప్రపంచానికి వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు అయితే చేతితో చెల్లింపులు చేసేముందు ఆ వ్యక్తి తన బ్యాంక్ అకౌంటును We Pay Wallet కు లింకు చేసుకోవాల్సి ఉంటుంది. అలా లింకు చేసుకొని ఎక్కడైతే అరచేతితో పంపే మిషన్ ఉంటుందో అక్కడ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ శాతం యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఇందులో ఉండే కొన్ని సమస్యలను గుర్తించి కొత్తగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి సైబర్ క్రైమ్ కు గురికాకుండా ఉండవచ్చని పేర్కొంటున్నారు.
Also Read: సముద్రంలో ఇది కనిపిస్తే బతికి ఉన్నా సచ్చినట్టే!
అయితే ఇది ఒకవేళ ఇండియాలోకి వస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూడాలి. కొత్త టెక్నాలజీని ఆస్వాదించడం అందరికీ ఇష్టమే. కానీ ఇందులో కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. అరచేతితో లింకు చేయడం ద్వారా కేవలం మర్చంట్ చెల్లింపులు మాత్రమే చేయవచ్చు. ఇతరులకు డబ్బు పంపించే మార్గం ఉండే అవకాశం లేదని కొందరు నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఆసక్తిగా ఉండడంతో చాలామంది దీనిని వీక్షిస్తున్నారు.