Oppo A60: ఇప్పుడు నడుస్తోంది 5 జీ ట్రెండ్. వినియోగదారులు తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లు ఉండే ఫోన్లను ఆశిస్తున్నారు. అలాంటి వారి కోసం ఒప్పో(OPPO) A60 పేరుతో సరికొత్త మోడల్ తీసుకొచ్చింది. 90 హెచ్ జడ్ రీ ఫ్రెష్ రేట్, 6.67 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్, 8 జీబీ ర్యామ్ ఈ ఫోన్ కు ఉన్న మరో ప్రధాన ఆకర్షణ. 256 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ 45 డబ్ల్యూ సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ తో లభిస్తుంది. 5000 ఎంఎహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇది 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాలు కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 8 ఎంపీ సామర్థ్యంతో ఏర్పాటుచేసిన కెమెరా సెల్ఫీలకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది
ఏ స్థాయిలో లభిస్తుందంటే..
ఒప్పో ఏ60 8 జీబీ + 128 జీబీ ర్యామ్ ధర 18,060 గా ఉంది..8 జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర 21,360 వరకు లభిస్తుంది. ఇది మిడ్ నైట్ పర్పుల్, రిప్పల్ బ్లూ కలర్ లో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ మోడల్ ను ఒప్పో కంపెనీ చైనా, వియత్నాం మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. “ది జియోయ్ డి గాంగ్, డియెన్ మే క్సాన్” వంటి ఆన్ లైన్ పోర్టల్స్ లో ఈ ఫోన్ లను విక్రయానికి పెట్టింది. అయితే, ఈ హ్యాండ్ సెట్ భారతదేశంలో ఇంకా రిలీజ్ కాలేదు. అయితే మన దేశ మార్కెట్లోకి విడుదల చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ప్రత్యేకతలు ఏంటంటే
ఒప్పో ఏ60 డ్యూయల్ సిమ్ (నానో) ను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్ 14.0.1 సపోర్ట్ తో రన్ అవుతుంది. 90 హెచ్ జడ్ రి ఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రత్యేకత. 6.67 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్ దీని సొంతం. 8 జీబీ ఎల్పీడీడీఆర్ 4 ఎక్స్ ర్యామ్ ను ఈ ఫోన్లో పొందుపరిచారు. అక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో ఈ ఫోన్ పని చేస్తుంది.
ఫోటోలు, వీడియోల్లో అద్భుతమైన క్లారిటీ ఈ ఫోన్ సొంతం. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా అద్భుతమైన అనుభూతి అందిస్తుంది.. ఫోటోలలో డెప్త్ కోసం ఎఫ్ 2.4 ఎపర్చర్ తో 2- మెగాపిక్సల్ సెకండరీ కెమెరా తోడ్పడుతుంది. 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ కు ఉన్న మరో ప్రత్యేకత. ఈ హ్యాండ్సెట్ 256 జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. మరింత మెమరీ కావాలనుకుంటే కార్డ్ వేసుకోవచ్చు. యూఎఫ్ఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఈ ఫోన్ కు ఉన్న మరో ఆకర్షణ. 4 జీ ఎల్టీఈ, వైఫై, బ్లూ టూత్ 5.0, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, ఏ – జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి వాటిని ఈ ఫోన్లో పొందుపరిచారు.
ఈ ఫోన్లో ఏర్పాటు చేసిన సెన్సార్లలో మ్యాగ్నటోమీటర్, యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్, సామిప్య సెన్సార్ వంటివి వినియోగదారులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. బయోమెట్రిక్ సౌకర్యం కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను ఈ ఫోన్లో పొందుపరిచారు. ఈ ఫోన్ బరువు 186 గ్రాముల బరువు ఉంటుంది.