Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీMoto G45 5G: స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో మోటో...

Moto G45 5G: స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో మోటో జీ45 5జీ లాంచ్.. ధర స్పెషిఫికేషన్స్ తెలుసుకుందాం..

Moto G45 5G: స్మార్ట్ ఫోన్ రంగంలో ఒత్తిడిని తట్టుకొని నిలుస్తున్న కంపెనీల్లో మోటోరోలా ఒకటి. మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ ‘మోటో జీ45 5జీ’ని రీసెంట్ గా రిలీజ్ చేసింది. డాల్బీ అట్మాస్ సపోర్ట్, 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు. మోటో జీ45 5జీ స్మార్ట్ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ సీ63 5జీ, పోకో ఎం6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం14, లావా బ్లేజ్ 5జీ వంటి స్మార్ట్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

మోటో జీ 45 5జీ ధర, సేల్ ఆఫర్లు, లభ్యత
మోటో జీ 45 5జీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయ్యింది. వీటిలో ప్రారంభ వేరియంట్ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 10,999 గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 12,999 గానూ నిర్ణయించారు. బ్రిలియంట్ బ్లూ, వివా మాగ్నెటా, బ్రిలియంట్ గ్రీన్ కలర్ వేరియంట్లలో ఇది లభిస్తుంది.

మోటో జీ 45 5జీ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 28న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, మోటోరోలా అధికారిక ఇండియా వెబ్ సైట్ లో సేల్ ప్రారంభిస్తుంది. సేల్ ఆఫర్ల విషయానికస్తే, కొనుగోలు దారులకు యాక్సిస్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. రూ. 2,000 క్యాష్ బ్యాక్, రూ. 3,000 విలువైన వోచర్లతో సహా రూ. 5,000 విలువైన ప్రయోజనాలు కూడా వినియోగదారులకు లభిస్తాయి.

మోటో జీ 45 5జీ స్పెసిఫికేషన్లు
మోటో జీ 45 5జీలో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లే, 1600 ఎక్స్ 720 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, డిస్ ప్లే ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రినో జీపీయూతో పాటు క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ సెట్ ఇందులో పొందుపరిచారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ 15కు అప్ గ్రేడ్ చేస్తామని, మూడేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్ లు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. మోటో జీ 45 5జీ స్మార్ట్ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

మోటో జీ45 5జీ స్మార్ట్ ఫోన్ లో 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో బాక్స్ లో 18వాట్ అడాప్టర్ తో రావడం గమనార్హం. కనెక్టివిటీ కోసం, ఇది 5 జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ కూడా లభిస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఐపీ 52 రేటింగ్, స్టీరియో స్పీకర్లతో వస్తుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular