LAVA: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లావా బొల్డ్ 5Gని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ నేటి నుండి అమెజాన్‌లో తొలిసారిగా అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. మొదటి సేల్ సందర్భంగా లావా భారీ తగ్గింపును అందిస్తోంది. కొత్త ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా మంచి అవకాశం. లావా బొల్డ్ 5G మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఇక టాప్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.13,000గా ఉంది. అయితే, తొలి సేల్‌లో 6GB RAM వేరియంట్‌పై బ్యాంక్ డిస్కౌంట్ కింద రూ.1500 తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే అదనంగా రూ.10,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
లావా బొల్డ్ 5G అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 8GB వరకు వర్చువల్ RAM, 128GB వరకు స్టోరేజ్ దీని సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 15 అప్‌గ్రేడ్, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు కూడా లభిస్తాయి. ఈ ఫోన్‌లో 64MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
లావా బొల్డ్ 5G 3D కర్వ్డ్ డిస్‌ప్లే ,120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లేకు GC గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా లభించింది. మొత్తానికి, లావా బొల్డ్ 5G తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందిస్తోంది. తొలి సేల్‌లో లభిస్తున్న తగ్గింపుతో ఇది మరింత బెస్ట్ ఆప్షన్ కానుంది. కొత్త ఫోన్ కొనాలనుకునేవారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి