Jio Airfiber : కేబుల్ అవసరం లేకుండా బ్రాడ్ బ్యాండ్ సేవలు.. జియో సంచలనం..

కేబుల్ అవసరం లేకుండా సింగిల్ డివైజ్ తో బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిచేందుకు ఆర్ఐఎల్ రెడీ అవుతోంది. త్వరలో దీనిని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దం చేస్తోంది.

Written By: Chai Muchhata, Updated On : April 27, 2023 11:26 am
Follow us on

Jio Airfiber : ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా బ్రాడ్ బ్యాండ్ సేవలు కోరుకుంటారు. హై స్పీడ్ తో పాటు ఇతర డివైజ్ లకు వైఫై వచ్చే విధంగా చూసుకుంటారు. ఇప్పటి వరకు కొన్ని కంపెనీలు ఇలాంటి సేవలు అందించేందుకు ఫైబర్ ఆప్టికల్ ను ఉపయోగించారు. ఓ డివైజ్ ను అందించి దానికి కేబుల్ ఉపయోగించేవారు. ఆ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ అందుతూ ఉండేది. కానీ ఇప్పుడు వినియోగదారులను ఆకర్షించేందుకు ‘జియో’ సంచలనం సృష్టించబోతుంది. కేబుల్ అవసరం లేకుండా సింగిల్ డివైజ్ తో బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిచేందుకు ఆర్ఐఎల్ రెడీ అవుతోంది. త్వరలో దీనిని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దం చేస్తోంది. మరి దాని వివరాలేంటో చూద్దామా..

మొబైల్ రంగంలో ‘జియో’ ఇప్పటికే విప్లవాన్ని సృష్టించింది. అతి తక్కువ ధరకే ఫోన్ ఇచ్చి హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగించింది. అయితే లేటేస్టుగా వితౌట్ కేబుల్ ద్వారా బ్రాడ్ బాండ్ సేవలను వినియోగించేలా అవకాశం కల్పించనుంది. ఇప్పటి వరకు జియో నుంచి వితౌట్ కేబుల్ అంటే రూటర్ ను ప్రవేశపెట్టింది. అయితే ఇందులో సంబంధిత సిమ్ వేసి ఆ సిగ్నల్ ఆధారంగా ఇంటర్నెట్ నువాడుకునేవారు.

కానీ ఇప్పుడు ఇప్పుడు ‘జియో ఫైబర్’ కేవలం సింగిల్ డివైజ్ ను మాత్రమే ఇస్తారు. దీనికి ఎలాంటి కేబుల్ అవసరం లేదు. పైగా దీనిని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. వెయ్యి చదరపు అడుగుల దూరంలో ఇతర డివైజ్ లకు వైఫై యూజ్ చేసుకోవచ్చు.  ఇది దగ్గర్లోని జియో టవర్ల ద్వారా ఇంటర్నెట్  సౌకర్యాన్ని అందిస్తుంది.

సాధారణంగా ఫైబర్ నెట్ కోసం మోడెంను తీసుకొచ్చి.. ఇన్ స్టాలేషన్ కోసం టెక్నికల్ ఎక్స్ పర్ట్ ను సంప్రదించాలి. కానీ దీనిన ప్లగ్ ఆన్ ఆఫ్ పద్దతి ద్వారా వాడుకోవచ్చు. సింగిల్ డివైజ్ ను ఆన్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా నెట్ ఆన్ అవుతుంది. అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. దీని ద్వారా క్రికెట్ మ్యాచులు చూడలనుకునేవారు మల్టీపుల్ స్క్రీన్లు కూడా అటాచ్డ్ చేసుకోవచ్చు. ఒకేసారి పలు కెమెరా యాంగలి్స్ లో అల్ట్రా హై డెఫినిషన్ తో లైవ్ క్రికెట్ ను చూడొచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

త్వరలో ఈ సేవలు దేశ వ్యాప్తంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్ఐఎల్ ప్రెసిడెంట్ కిరణ్ థామ్ తెలిపారు. వచ్చే దీపావళి నాటికి 5 జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్ఐఎల్ ప్రకటించింది. అంతకుముందే జియో ఫైబర్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇక జియో ఫైబర్ మార్కెట్లోకి వస్తే మిగతా డివైజ్ ల మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.