Roommate syndrome in the relationship: ఈరోజుల్లో చాలామంది లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారు. నిజానికి ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన కల్చర్. కానీ ఇండియాలో ఇప్పుడు ఎక్కువగా ఆచరిస్తున్నారు. ఇది పక్కన పెడితే కొందరు తెలియని వ్యక్తులతో రూమ్ షేర్ చేసుకుంటారు. ఒకప్పుడు సేమ్ జెండర్ ఉంటే.. ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు రూమ్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడిది కామన్ అయిపోయింది. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా ఒకే ఇంట్లో కలిసి ఉండటం. అయితే ఒకే రూమ్‌లో ఉంటారు. కానీ ఎలాంటి సంబంధం కూడా ఉండదు. కేవలం ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంటుంది. దీనినే రూమ్మేట్ సిండ్రోమ్ అంటారు. అయితే ఈరోజుల్లో చాలా జంటలు దీనినే ఫాలో అవుతున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరూ ఉంటారు. కానీ ఇద్దరికీ ఎలాంటి సంబంధం ఉండదు. ఎవరికి నచ్చినట్లు ఉంటుంటారు. ఒకే గదిలో ఉన్నా కూడా వీరికి ఒకరి మీద ఒకరికి ఇష్టాలు ఉండవు. ఒకరి ఇష్టాలు, కోరికలు ఏంటో కూడా తెలియవు. భార్యాభర్తలే కానీ.. స్నేహితులా ఉంటారు. దీనినే రూమ్మేట్ సిండ్రోమ్ అంటారు.
భార్యాభర్తల బంధంలో రూమ్మేట్ సిండ్రోమ్ ఉండకూడదు. భార్యాభర్తలు సంతోషంగా ఉంటేనే జీవితం బాగుంటుంది. కానీ చాలామంది దంపతులు ఈ రోజుల్లో ఒకే ఇంట్లో ఉంటారు. కానీ భార్యాభర్తలుగా ఉండరు. ఎవరి పనులు వారు చేసుకుంటూ, ఎవరి ఉద్యోగాలు చేసుకుంటూ ఒక్కరే జీవితాన్ని గడుపుతారు. ఏదో పేరుకే ఇంట్లో ఇంకో పర్సన్ ఉంటారు. మీ బంధంలో ఎప్పుడైనా ఇలా అనిపిస్తే వెంటనే జాగ్రత్తపడండి. ఏ బంధంలో అయిన ప్రేమ, ఆప్యాయతలు చాలా ముఖ్యం. భాగస్వామి నుంచి ప్రతి ఒక్కరూ ఇవి కోరుకుంటారు. కానీ ఈరోజుల్లో జంటలు ఎలా అయిపోయారంటే.. పిల్లలు కోసం కలవాలి, గదిలో ఉంటే కలయికలో పాల్గొనాలని అనుకుంటారు. ఇలా మీ బంధంలో కూడా అనిపిస్తే అది రూమ్మేట్ సిండ్రోమ్ అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఎమోషన్స్ ఎప్పటికీ అలాగే ఉండాలి. బంధం ఎన్ని ఏళ్లు ముందుకెళ్లిన కూడా ఆ బంధం అలాగే కొనసాగుతుండాలి.
కొందరు రిలేషన్ కొత్తలో ఎక్కువ సమయం గడపడం వంటివి చేస్తారు. కొన్ని రోజులకి ఇక అసలు కనీస సమయం కూడా గడపరు. ఒకే ఇంట్లో ఉండటమే.. కానీ స్నేహితులా ఉంటారు. ఫ్రెండ్స్ అయిన కనీసం అప్పుడప్పుడు మాట్లాడుతారు. కానీ భార్యాభర్తలు మాత్రం మాట్లాడుకోరు. ఏ బంధంలో అయిన కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అది లేకపోతే ఇద్దరి మధ్య ప్రేమ తగ్గుతుంది. చిన్న విషయాలకి గొడవలు వస్తాయి. కాబట్టి బంధంలో రూమ్మేట్ సిండ్రోమ్ ఉండకూడదు. భార్యాభర్తలు సంతోషంగా కలిసి ఉంటేనే బంధం జీవితాంతం ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్, సమయం కేటాయించడం, సరదాగా బయటకు వెళ్లడం వంటివి ఉండాలి. అప్పుడు ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గర అవుతారు. భాగస్వామిలో ఒకరు కారణం లేకుండా అయిన మాట్లాడాలి. అలా సంభాషణ స్టార్ట్ చేస్తే.. ఇద్దరి మధ్య కమ్యునికేషన్ పెరుగుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయం గూగుల్ ఆధారంగా చెప్పడం జరిగింది.