https://oktelugu.com/

Artificial Intelligence: ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కు, ఏలియన్స్ కు ఏంటి సంబంధం? మానవాళికి పొంచి ఉన్న ముప్పు?

మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వల్ల తీవ్రంగా నష్టాలు ఉంటాయట. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పలు దేశాలు తమ సైనిక అవసరాలకు అటానమస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టం ను అభివృద్ధి చేస్తే.. అది అంతిమంగా నాగరికత నాశనానికి కారణమవుతుందట.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 18, 2024 / 08:59 AM IST

    Artificial Intelligence

    Follow us on

    Artificial Intelligence: శాస్త్ర సాంకేతిక రంగాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే కొత్త కొత్త పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవన్నీ మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగాన్ని ఒక ఊపు ఊపుతోంది. దీనివల్ల అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను మార్పులకు కారణమవుతోందనుకుంటే.. ఇప్పుడు సరికొత్తగా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తెరపైకి వచ్చింది. అయితే ఇది మనిషి రూపొందించిందే అయినప్పటికీ.. అంతకు మించిన తెలివితేటలతో పనిచేస్తుందట. మనిషి అర్థం చేసుకునే దానికంటే రెట్టింపు వేగంతో కార్యకలాపాలు సాగిస్తుందట. అభివృద్ధి, నాగరికత పెరుగుదలలో కీలకమైన దశతో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ సమానంగా ఉంటుందట. అక్కడితోనే కాదు.. మనుషులకు సంబంధించి ఇది ఇతర గ్రహాలపై మనగడ సాధ్యమా? కాదా? అనే అంశాలను కూడా కనుక్కుంటుందట. అయితే గ్రహాంతర నాగరికతల రహస్యాలను, వాటి వెనుక ఉన్న చిక్కుముళ్లను ఈ సాంకేతిక పరిజ్ఞానం విప్పలేదట. అందువల్లే దీనిని ఉపయోగించి గ్రహాంతరవాసుల మనుగడను, పుట్టుకను శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోతున్నారట.

    మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వల్ల తీవ్రంగా నష్టాలు ఉంటాయట. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పలు దేశాలు తమ సైనిక అవసరాలకు అటానమస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టం ను అభివృద్ధి చేస్తే.. అది అంతిమంగా నాగరికత నాశనానికి కారణమవుతుందట. అచ్చం హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు.. పరిస్థితి మారిపోతుందట. ఇక ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ సహాయంతో ఇతర గ్రహాలపై మనుషుల జీవనాన్ని సాధ్యం చేస్తే ఎలా ఉంటుందనే అన్వేషణ ఇటీవల తెరపైకి వచ్చింది. అయితే దీన్ని ఉపయోగించి చేసే పరిశోధనకు పరిమితులు ఉండడంతో.. పరిశోధకులు ఆలోచనలో పడ్డారు. ఒకవేళ ఆ దిశగా పరిశోధన చేస్తే వచ్చే ఫలితాలు, వాటి పర్యవసనాలు.. అవి మనిషి జీవితంపై చూపించే ప్రభావం.. వంటి వాటిని పరిగణలోకి తీసుకొని పరిశోధకులు పునరాలోచనలో పడ్డారట. అలాంటి ప్రయోగాలు చేస్తే అవి మనిషి జీవితానికి చేసే మంచి కంటే, చెడే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.

    సాంకేతిక పరిజ్ఞాన విస్తృతిలో భాగంగా హ్యుమానిటీ అనే విషయాన్ని మర్చిపోకూడదు. దానిని కనుక పరిగణలోకి తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతాయుతమైన వృద్ధిని నమోదు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. సెర్చ్ ఫర్ ఎక్స్ ట్రా టెరెస్ట్రియల్ ఇంటలిజెన్స్ ను ఒక ఫ్రేమ్ వర్క్ గా ఉపయోగించడం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగంతో భవిష్యత్తును బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఆ అంశాల పరిధికి మించి పరిశోధనలు చేస్తే.. అది అంతిమంగా చెడుకు దారితీస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల విస్తృతిని దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు.