Vivo కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. దీనికి సబ్ బ్రాండ్ గా iQOO మొబైల్ కు కూడా ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ కు డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా గేమింగ్ తో పాటు, 4k వీడియోలు చూసేందుకు అనుగుణంగా మొబైల్ ను తీసుకువచ్చారు. దాని పేరే iQOO 15 R.అయితే ఇప్పటికే 2025లో ఐక్యూ 15 మార్కెట్లోకి వచ్చి ఓరియంటెడ్ మోడల్ గా రాణిస్తోంది. ఇప్పుడు 15 R మరి తగ ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ఉంచారు. ఈ వివరాల్లోకి వెళ్తే..
చైనా కు చెందిన ఐక్యూ 15 R ఈ జనవరిలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఐక్యూ Z 11 Turbo మోడల్ కు ఇది రిబ్రాండెడ్ వర్షం గా చెప్పుకుంటున్నారు. అలాగే కొత్త మొబైల్ Qualcomm Snapdragon 8 gen 5 చిప్ సెట్ పర్ఫామెన్స్ ఉండనుంది. మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి ఈ సాఫ్ట్వేర్ మద్దతుగా నిలుస్తుంది.
ఐక్యూ 15 R మొబైల్ లో బలమైన బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇందులో 6400 mAh లేదా 7000 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బ్యాటరీలు 100 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయ్యే అవకాశం ఉంది. దీంతో రోజంతా వినియోగం చేసేవారికి.. గేమింగ్ పై ఆధారపడే వారికి.. 4k వీడియోలు తీసేవారికి చార్జింగ్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో చాలామందికి ఇది అనుకోగా ఉండే అవకాశం ఉంది.
అలాగే ఈ మొబైల్లో 8 జిబి నుంచి 16 జిబి వరకు రామ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. 256 జీబీ నుంచి 512 జిబి వరకు స్టోరేజ్ ఉండడంతో ఫోటోలు, వీడియోలు, రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గేమింగ్ ఆడే వారికి కూడా అనుకోగా ఉంటుంది. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్లు, అడ్వాన్సుడ్ కూలింగ్ సిస్టం కూడా ఉండనున్నాయి. స్లిమ్ డిజైన్ తో ఆకర్షణీయంగా కనిపించే ఈ ఫోన్ పై గ్లాస్ లేదా ఫైబర్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది. ఇండియా మార్కెట్లోకి వస్తే దీనిని రూ. 40,000 నుంచి రూ. 50,000 వరకు విక్రయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొత్తగా మొబైల్ కొనే వారితోపాటు అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన మొబైల్ కోసం ఎదురు చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. అయితే మార్కెట్లోకి రాగానే ఇది ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి.