IPhone 18 Series: భారతదేశంలో యాపిల్ ఫోన్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. ఈ కంపెనీ నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. అయితే ఇప్పటి వరకు 17 సిరీస్ లను తెచ్చిన ఈ కంపెనీ లేటేస్ట్ గా 18 సిరీస్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. అయితే లేటేస్ట్ గా ఆపిల్ ఐఫోన్ 18 Pro Max గురించి కొంత సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో చూద్దాం..
ఐఫోన్ తరువాతి సిరీస్ 18 Pro Max సెప్టెంబర్ 2026 రెండో వారంలో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, కెమెరా సిస్టమ్, డిజైన్ అన్ని విభాగాల్లో ప్రీమియం అనుభూతిని అందిస్తుందని సమాచారం. సాధారణంగా ఆపిల్ వరుసగా రెండేళ్లపాటు డిజైన్ లాంగ్వేజీని మార్చదు. కాబట్టి ఐఫోన్ 18 ప్రో మాక్స్ కూడా గత మోడల్ లుక్‌ను కొనసాగించే అవకాశం ఉంది.
ఐఫోన్ 18 ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్ సైజులో రానుంది. ఇది ఇప్పటికే వచ్చిన మోడల్‌లతో సమానమే అనుకోవచ్చు. ఈ ఫోన్ 1320×2868 రెజల్యూషన్‌తో OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు HDR సపోర్ట్ ఉండనుంది.
ఐ ఫోన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా TSMC యొక్క అత్యంత అధునాతన 2nm ప్రాసెస్ ఆధారంగా తయారైన A20 Pro చిప్‌తో రానుంది. ఈ చిప్ 4.5 GHz బిగ్ కోర్ స్పీడ్, 2.5 GHz స్మాల్ కోర్ స్పీడ్‌ను కలిగి ఉంటుంది. 2 బిగ్ కోర్లు, 4 స్మాల్ కోర్లతో 12GB RAM దీనిలో ఉంటుంది. ఈ చిప్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఎఫిషియన్సీ , ఏఐ ఫీచర్లలో మెరుగుదలను అందిస్తుంది.
ఐఫోన్ 18 ప్రో మాక్స్ వెనుక వైపు ట్రిపుల్ 48MP కెమెరా సెటప్‌తో రానుంది. ఈ సెటప్‌లో అల్ట్రా వైడ్, టెలిఫొటో లెన్స్‌లు ఉంటాయి. ముఖ్యంగా, వేరియబుల్ మెకానిజం ప్రధాన సెన్సార్‌లో ఉండనుంది. 18 ప్రో మాక్స్ 5,000-5,200mAh బ్యాటరీతో రానుంది. ఇది 40W ఫాస్ట్ వైడెడ్ ఛార్జింగ్, 25W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టు చేయనుంది.
ఇందులో 12GB RAM, 256 నుంచి 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లతో రానుంది. భారతదేశంలో 256GB వేరియంట్ ధర రూ.1,64,900గా ఉండే అవకాశం ఉంది. 1TB వేరియంట్ ధర రూ.2,14,900 వరకు ఉండవచ్చు.ఈ ఫోన్ iOS 27 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుంది. 5G మరియు 4G కనెక్టివిటీ, USB టైప్ C పోర్ట్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్లలో మెరుగుదలలు ఉంటాయి. 5G సేటెలైట్ కనెక్టివిటీ కూడా మొదటిసారి ఐఫోన్లో ఉండవచ్చు.
