Mahindra XUV 7×0: ధర ఎక్కువైనా కూడా Mahindra కార్లకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. మార్కెట్లోకి ఈ కంపెనీ కార్లు వస్తున్నాయంటే.. ఇప్పటికే కార్లు ఉన్నవారు సైతం వాటి స్థానంలో మహీంద్రా కార్లను చేర్చుకుంటారు. బలమైన బాహ్యరూపం ఉండే ఈ కార్లలో XUV 700 గురించి ఇప్పటికే తెలిసి ఉంటుంది. అయితే XUV 700 కారు ఇఫ్పుడు అప్డేట్ అయి మార్కెట్లోకి రాబోతుంది. అంతే కాకుండా XUV 700 ను XUV 7X0గా మార్చబోతున్నారు. అయితే కేవలం పేరు మాత్రమే కాకుండా ఫీచర్స్ కూడా అప్డేట్ కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళితె..
2026 జనవరి 5న లాంచ్ కాబోతున్న XUV 7X0 ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహీంద్రా కంపెనీకి చెందిన XUV 700 SUV ఫేస్ లిప్ట్ వేరియంట్ లో సక్సెస్ గా నిలిచింది. మరోసారి ఇది హైలెట్ కావడానికి ఇదే పేరును కాస్త మారుస్తున్నారు. ఈ కారు ఫీచర్స్ విషయానికొస్తే.. ప్రీమియం లుక్ కలిగిన హెడ్ లైట్స్ ఆకర్షించనున్నాయి. ఇవి ఏ సమయంలో రన్నింగ్ అయినా ఆన్ లోనే ఉంటాయి. ట్రాపెజోయిడల్ ఎల్ఈడీ లైట్ యూనిట్లు ఉండడంతో ఇటీవల మార్కెట్లోకి వచ్చిన XEV 9S ను తలపిస్తున్నాయి. అలాగే దీనికి భిన్నమైన టెయిల్ లైట్స్, ఐకానిక్ స్లాటెడ్ గ్రిల్ కొత్తగా కనిపిస్తాయి. ఈ కారు 6 సీటర్ తో పాటు 7 సీటర్ కూడా అందుబాటులో ఉండనుంది.
ఈ మోడల్ 2.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 2.2 లీటర్ డీజిల్ యూనిట్ ను కూడా అమర్చారు. ఈ రెండు ఇంజన్లు 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటివ్ గేర్ బాక్స్ తో పనిచేస్తాయి. డీజిల్ ఇంజిన్ లో AWD అనే అదనను సౌకర్యం ఉండనుంది. ఇది మార్కెట్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న టాటా సఫారీ, MG హెక్టర్, హ్యుందాయ్ అల్కాజార్ తో పోటీ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అయితే ఈ కార్లను ఢీ కొట్టేందుకు XUV 7X0 ను రూ.13.66 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 23.71 లక్షల వరకు విక్రయించనున్నారు.
SUV కార్లను అందించడంలో మహీంద్రా ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇప్పుడ ఫేస్ లిప్ట్ కారుతో కూడా వినియోగదారులను ఆకట్టుకోనుంది. అయితే ఈ కారు ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.