Google Pixel: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఏది ముట్టుకున్న బంగారమే. డేటా సెంటర్ నుంచి మొదలు పెడితే క్లౌడ్ కంప్యూటింగ్ వరకు ప్రతి విభాగంలోనూ గూగుల్ సరికొత్త చరిత్రను సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ద్వారా సాగుతున్న వ్యాపారంలో 70% వాటాను గూగుల్ సొంతం చేసుకుంది. కానీ ఒక విషయంలో మాత్రం గూగుల్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దీంతో అది నేర్పిన పాఠంతో గూగుల్ నష్ట నివారణ చర్యలను చేపట్టింది.
ఆపిల్ కు పోటీగా గూగుల్ అప్పట్లో ఫిక్స్ఎల్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆపిల్ కు మించిన సౌకర్యాలతో ఈ ఫోన్ ను తెరపైకి తీసుకువచ్చింది. అయితే గూగుల్ ఊహించినట్టుగా లాభాలు కాదు కదా, నష్టాలు పలకరించాయి.. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.
ఈ డిసెంబర్ నుంచి ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లలో అదనపు సాఫ్ట్వేర్ అప్డేట్ ను గూగుల్ చేపడుతున్నట్టు తెలుస్తోంది. గూగుల్ సాధారణ నెలవారి భద్రతా ప్యాచ్ లు లేదా అదనపు ఫీచర్ అప్డేట్ మాదిరిగా కాకుండా.. సాఫ్ట్వేర్ అప్డేట్ ను గూగుల్ విభిన్నంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల పోస్ట్ అప్డేట్ సమస్యలను పరిష్కరిస్తామని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి.
గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం రీడ్ ఇట్ లో కనిపించింది. పిక్సెల్ 8,9,10 సిరీస్లలో వినియోగదారులకు ఇప్పటికే గూగుల్ ప్రధాన బిల్ట్ ఇన్స్టాల్ చేసింది. ఇది కాకుండా ఓవర్ ది ఎయిర్ అప్డేట్ కూడా ఆ ఫోన్లలో పూర్తయినట్టు తెలుస్తోంది. దీనిపరిమాణం 25MB వరకు ఉంటుంది. ఇది పూర్తి సిస్టం అప్డేట్ కాదని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. మొదట్లో ఈ అప్డేట్ యునైటెడ్ స్టేట్స్ లోని వినియోగదారుల మీద గూగుల్ ప్రయోగించింది. ఆ తర్వాత ఇంగ్లాండులో తక్కువ సంఖ్యలో ఫోన్ల ను అప్డేట్ చేసింది.
బగ్ లు ఉన్న ఫోన్లు మాత్రమే లక్ష్యంగా చేసుకొని గూగుల్ ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మిగతా దేశాలలో ఈ అప్డేట్ కనిపించింది. చాలా వరకు ఫోన్లలో బ్యాటరీ డ్రైన్, టచ్ రెస్పాన్సిబిలిటీ సమస్యలు గుర్తించినట్టు గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 14 నుంచి 16 వరకు ఉపయోగించే ఫోన్లలో ఆఫ్ లైన్ యాక్సెస్ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఆ వినియోగదారుల ఫోన్ లను అప్డేట్ చేసినట్టు తెలుస్తోంది. బగ్ ల భవిష్యత్తు కాలంలో ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఉండడానికే గూగుల్ ఈ పని చేసినట్టు తెలుస్తోంది.
గూగుల్ డిసెంబర్ నాటికి ఫిక్సల్ డ్రాప్ ను ,రెగ్యులర్ సెక్యూరిటీ, బగ్ ఫిక్స్ అప్డేట్ ను విడుదల చేయనుంది. అయితే గూగుల్ చేస్తున్న ఈ పని ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? అనే ప్రశ్నకు సమాధానం లభించలేదు. Google తదుపరి ప్రకటన చేసేవరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తు కాలంలో ఆపిల్ సంస్థను అధిగమించడానికి.. గూగుల్ ఈ పని చేస్తున్నట్టు తెలుస్తోంది.