Instagram new feature Instants update: ఒకప్పుడు టిక్ టాక్ యాప్ ద్వారా చాలా మంది తమ వీడియోలను అప్లోడ్ చేసి ఫేమస్ అయ్యేవారు. దీనిని బ్యాన్ చేసిన తరువాత ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ ఆ స్థాయిలో అభివృద్ధి చెందింది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ యాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఇన్స్టంట్స్’ పేరుతో ఇప్పటికే ఇటలీ, స్పెయిన్ దేశాల్లో మొదటి దశలో అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ రియల్‌టైమ్ మూమెంట్స్‌ను క్యాప్చర్ చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. అంతేకాకుండా ఇది స్నాప్‌చాట్‌కు పోటీ ఇస్తూ డిజైన్ చేయబడినట్లు ఇన్స్టాగ్రామ్ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఇప్పటికే యూరప్‌లోని ఈ రెండు దేశాల్లో ఇన్ స్టంట్స్ కు లక్షలాది మంది యూజర్లు ఉన్నారు. దీన్ని డౌన్లోడ్ చేసి, ప్రయోగిస్తున్నారు. దీనిని ఎలా వాడుతున్నారంటే?
ఇన్స్టంట్స్ యాప్‌లో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు కేవలం 24 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇందులో ఫోన్లోని కెమెరా ద్వారా తీసిన ఫోటోలు, వీడియోలను మాత్రమే అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. గ్యాలరీ నుంచి పాత ఫైల్స్‌ను అప్ లోడ్ చేయడానికి అవకాశం లేదు. యూజర్లను రియల్‌టైమ్ మూమెంట్స్‌కు పరిమితం చేసి, ఆత్మీయతను పెంచేందుకే ఈ నిబంధనను పెట్టింది. మ్యూచువల్ ఫాలోవర్స్ లేదా ‘క్లోజ్ ఫ్రెండ్స్’ వారికి మాత్రమే పంపేందుకు వీలుంటుంది. ఈ ఫొటోలు లేదా వీడియోలు పబ్లిక్ గా పోస్టులు చేయలేరు.
ఈ యాప్ ఇన్స్టాగ్రామ్ మెయిన్ అకౌంట్‌తో సమర్థవంతంగా లింక్ అవుతుంది, కానీ స్వతంత్రంగా పనిచేస్తుంది. స్నాప్‌చాట్‌లోని ‘స్నాప్స్’ లాగా, ఇక్కడ కూడా ఫిల్టర్లు, స్టికర్లు, టెక్స్ట్ ఓవర్‌లేలు ఉపయోగించి క్రియేటివ్‌గా ఎడిట్ చేయవచ్చు. ప్రైవసీ సెట్టింగ్స్ బలంగా ఉండటంతో, యూజర్లు భయం లేకుండా పంచుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ CEO ఆడమ్ మోసేరి మాట్లాడుతూ.. ‘ఇది మన ఫ్రెండ్స్‌తో నిజమైన మూమెంట్స్‌ను షేర్ చేసే సులభమైన మార్గం’ అని చెప్పారు.
ప్రస్తుతం ఇటలీ, స్పెయిన్‌లో బీటా వెర్షన్‌గా లాంచ్ అయిన ఇన్స్టంట్స్.. త్వరలో యూరప్ లోని ఇతర దేశాల్ల విస్తరించనుంది. భారత్‌లో టెస్టింగ్ దశలో ఉందని సమాచారం. స్నాప్‌చాట్‌తో పోల్చితే, ఇన్స్టాగ్రామ్ యొక్క 2 బిలియన్ గ్లోబల్ యూజర్ బేస్ కారణంగా ఇది వేగంగా పాపులర్ అవుతుందని నిపుణులు అంచనా. యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మరిన్ని ఫీచర్లు జోడించనున్నారు.
ఈ లాంచ్ సోషల్ మీడియా ఫ్యూచర్‌ను మార్చే అవకాశం ఉందని కొందరు కొనియాడుతున్నారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ మద్య ఇది కొత్త రెవెన్యూ స్ట్రీమ్‌లను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బ్రాండెడ్ కంటెంట్, యాడ్స్ ఇక్కడికి వస్తాయి.