https://oktelugu.com/

Indian CEOs: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ దిగ్గజ కంపెనీల్లో భారతీయులకే అత్యున్నత పదవులు.. ఎందుకు..?

Indian CEOs: ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన టెక్ కంపెనీలను భారతీయులే నడిపిస్తుండడం విశేషంగా చెప్పొచ్చు. మొన్న సుందర్ పిచాయ్.. నిన్న సత్య నాదేళ్ల.. నేడు పరాగ్ అగర్వాల్.. ఇలా దిగ్గజ కంపెనీలకు సీఈవోలగా మారి భారత్ పేరును నిలబెడుతున్నారు. కంపెనీ ఏదైనా భారత్ కు చెందిన వారే దక్కించుకోవడం చూస్తే ఇక్కడి మేథస్సుకు ప్రపంచంలో ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతోంది. అంతేకాకుండా ఇండియా తన పౌరులకు సమగ్ర శిక్షణ ఇచ్చినట్లుగా మరే దేశం ఇవ్వడం లేదని […]

Written By:
  • NARESH
  • , Updated On : December 5, 2021 / 11:31 AM IST
    Follow us on

    Indian CEOs: ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన టెక్ కంపెనీలను భారతీయులే నడిపిస్తుండడం విశేషంగా చెప్పొచ్చు. మొన్న సుందర్ పిచాయ్.. నిన్న సత్య నాదేళ్ల.. నేడు పరాగ్ అగర్వాల్.. ఇలా దిగ్గజ కంపెనీలకు సీఈవోలగా మారి భారత్ పేరును నిలబెడుతున్నారు. కంపెనీ ఏదైనా భారత్ కు చెందిన వారే దక్కించుకోవడం చూస్తే ఇక్కడి మేథస్సుకు ప్రపంచంలో ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతోంది. అంతేకాకుండా ఇండియా తన పౌరులకు సమగ్ర శిక్షణ ఇచ్చినట్లుగా మరే దేశం ఇవ్వడం లేదని ఆర్థిక నిపుణులు పేర్కొనడం గర్వకారణం. కాగా అమెరికాలోని సిలికాన్ వ్యాలిలో ఉన్న భారతీయులే ఇలా కంపెనీలకు సీఈవోలుగా మారడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీరే కాకుండా దాదాపు 40 లక్షల మంది భారత సంతతికి  చెందిన వారు వివిధ కంపెనీల్లో ఆధిపత్య హోదాను సాధించారు.

    Indian CEOs

    భారతీయులు ప్రపంచంలో ఎక్కడైనా బతుకగలుగుతారు.. అని కొందరు అంటుంటారు. ఎందుకంటే ‘బర్త్ డే సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ల వరకు.. అన్నీ అరకొర వసతులు, సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి తమ మేథో సంపత్తిని మెరుగు పరచడం కోసం భారతీయులు చాలా కృషి చేస్తారని భారతీయ కార్పొరేట్ స్ట్రేటజిస్ట్ సీకే ప్రహ్లద్ పేర్కొన్నారు. పోటీ అనిశ్చిత పరిస్థితుల మధ్య ఇక్కడ పెరిగిన వారు సమస్యలను తొందరగా పరిష్కరించేలా ఎదుగుతారు. దీంతో మిషన్లలా పనిచేసే అమెరికా ఆఫీసుల్లో భారతీయ సహజ కష్టించే తత్వానికి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే వీరు పతాక స్థాయికి ఎదుగగలుగుతున్నారు.

    అమెరికా జనాభాలో భారత సంతతి ప్రజలు ఒక శాతం ఉన్నారు. ఇక సిలికాన్ వ్యాలీలో భారత్ కు చెందిన వారు 6 శాతం ఉన్నారు. అమెరికాలోని సంపన్న వర్గాల జాబితాలో ఈ సిలికాన్ కు చెందిన వారు కూడా ఉన్నారు. ఇందులో సుమారు 10 లక్షల మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారు. అమెరికా విదేశీయులకు జారీ చేసే హెచ్ 1 బి వీసాల్లో 70 శాతం భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకే దక్కుతున్నాయి. సియాటెల్ వంటి నగరాల్లో 40 శాతం భారతీయులే ఉన్నారు. ఇందుకు 1960లో అమెరికా ఇమిగ్రేషన్ పాలసీలో తీసుకొచ్చిన భారీ మార్పులే కాణమని అంటున్నారు. పౌర హక్కుల ఉద్యమ అనంతరం దేశాల ప్రాతిపదికన హెచ్ 1 బీ వీసాల కోటా కాకుండా నైపుణ్యలు, కుటుంబాలను కలుసుకోవడం అనే అంశాల ప్రాతిపదికన ఇచ్చే విధానం మొదలైంది. దీంతో ఉన్నత విద్యావంతులైన భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులు తొలుత అమెరికాలో అడుగుపెట్టడం మొదలు పెట్టారు. ఆ తరువాత ఉన్నత స్థానాన్ని అధిగమించారు.

    Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. రూపాయి పంపినా రూ.51 క్యాష్ బ్యాక్!

    అమెరికాలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి వీసాలకు ప్రాధాన్య రంగాలుగా మారాయి. అక్కడి హై అండ్ లేబర్ మార్కెట్ అవసరాలు తీర్చడమే ప్రాతిపదికన వీసాలు జారీ చేస్తున్నారు. ఇందుకోసం వెళ్లిన నాణ్యమైన మానవ వనరులు అక్కడి సంస్థల్లో చేరి తమ ప్రతిభను కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో వారు కంపెనీలకు సీఈవోలుగా మారుతున్నారు.

    ఇప్పుడు సీఈవోలుగా మారిన వారంతా ఒకప్పుడు చిన్నస్థాయి ఉద్యోగులే. ఒక్కో మెట్టు ఎక్కుతూ వారు ఈ స్థితికి వచ్చారు. అయితే ఇతర వ్యక్తుల కంటే భారతీయుల నడవడిక అక్కడి కంపెనీలకు నచ్చడంతో వారికి అవకాశం ఇస్తున్నారు. సత్య నాదేళ్ల, సుందర్ పిచాయ్ వంటి వారు సాఫ్ట్ నెస్ తో అత్యున్నత పదవికి ఎదిగారని కొందరు పేర్కొంటున్నారు. కష్టపడి పనిచేసే నైపుణ్యం, నైతిక విలువలు కూడా వీరికి ఉండడంతో అమెరికన్లు భారతీయులకు ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం కూడా ఉండడంతో అమెరికా టెక్ ఇండస్ట్రీలో మనోళ్లు ఛాన్స్ కొట్టేస్తున్నారు.

    Also Read: వామ్మో.. ఆ ప‌ని కోసం 11 పెళ్లిళ్లు చేసుకున్న మ‌హిళ‌.. ఇదేం వ్య‌స‌నం రా బాబు