Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీIndian startup company: అంత పెద్ద నాసాకు.. మన భారత స్టార్టప్ కంపెనీ దిక్కయింది.. ఇంతకీ...

Indian startup company: అంత పెద్ద నాసాకు.. మన భారత స్టార్టప్ కంపెనీ దిక్కయింది.. ఇంతకీ కాంట్రాక్ట్ విలువ ఎంతంటే..

Indian startup company : నాసా.. ఈ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త ప్రయోగాలు చేస్తూ.. సాంకేతికంగా అమెరికాను అత్యంత పటిష్టం చేసింది. అమెరికా నేడు సంపన్నమైన దేశంగా మారడం వెనక నాసా పాత్ర కూడా ఉంది. నాసా చంద్రుడి నుంచి మొదలుపెడితే సూర్యుడి వరకు చేయని ప్రయోగం అంటూ లేదు. అయితే ఆ ప్రయోగాలు కేవలం అమెరికా ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి. అయితే అంతటి నాసా కు మన దేశానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ దిక్కయింది. ఇంతకీ దీని వెనుక ఉన్న స్టొరీ ఏంటంటే..

మనదేశంలో ప్రవేట్ స్పేస్ క్రాఫ్ట్ స్టార్టప్ సంస్థగా పిక్సెల్ కు పేరుంది. ఈ సంస్థ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన అనేక పరికరాలను తయారుచేస్తోంది. వీటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. పైగా మనదేశంలో ఇస్రో రూపొందించే ప్రయోగాలలో కొన్ని పరికరాలను ఈ సంస్థ అందిస్తుంది. ఈ సంస్థ ప్రస్తుతం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కు సంబంధించి భూగోళ పరిశీలన డేటా సర్వీసులు అందించే కాంట్రాక్టు సొంతం చేసుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 476 మిలియన్ డాలర్లు. స్పేస్ క్రాఫ్ట్ హిస్టరీలోనే ఇది అత్యంత భారీ డీల్ అని చెబుతున్నారు.. అయితే ఈ డీల్ 8 కంపెనీలతో కుదిరిందని.. అందులో ఫిక్సెల్ కూడా ఒకటనే వార్తలు వినిపిస్తున్నాయి.. భూమిపై మనుషుల జీవనాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు నాసా పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కాంట్రాక్టు దక్కించుకున్న ఆ కంపెనీలు ఎర్త్ అబ్జర్వేషన్ డేటా ను నాసాకు అందిస్తాయి. కాంతి, తరంగ ధైర్ఘ్యాల రూపంలో ఉండే డాటాను ఈ కంపెనీలు హైపర్ స్పెక్ట్రల్ చిత్రాల రూపంలో సేకరిస్తాయి. వాతావరణంలో మార్పులను వివరిస్తుంది. వ్యవసాయంలో చేపట్టాల్సిన ఆధునికతను వెల్లడిస్తుంది. జీవ వైవిధ్యం గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తుంది. వనరుల నిర్వహణపై అవగాహన కల్పిస్తుంది. ఇంకా సూక్ష్మ విషయాలకు సంబంధించిన లోతైన విషయాలను పిక్సెల్ టెక్నాలజీ అందజేస్తుంది.

నాసా కాంట్రాక్ట్ దక్కిన నేపథ్యంలో ఫిక్సెల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అహ్మద్ వ్యక్తం చేశారు.” అంతరిక్ష ఆధారిత భూ పరిశోధనలో మాకు చోటు దక్కడం ఆనందంగా ఉంది. మా కంపెనీ ఇచ్చే హైపర్ స్పెక్ట్రల్ చిత్రాలు కీలకంగా మారబోతున్నాయి. దానికి ఇది నిదర్శనం. అత్యంత ప్రకాశవంతమైన దృశ్యాలను ఇచ్చే ఫైర్ ప్లైస్ ఉపగ్రహాలను మేము ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాం. భూగోళంపై అధ్యయనానికి సంబంధించి అవసరమయ్యే వివరాలను తక్కువ వ్యయంలో అందించేందుకు మేము కృషి చేస్తున్నాం. నాసా అందించిన కాంట్రాక్టు మా కంపెనీ ఎదుగుదలకు మరింతగా తోడ్పడుతుంది. ఇప్పటికే ఇస్రో చేపడుతున్న ప్రయోగాలలో మా వంతు భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాం. అయితే మా కంపెనీ అందిస్తున్న నాణ్యమైన సేవలను గుర్తించి నాసా మాకు ఈ కాంట్రాక్టు ఇచ్చింది. భవిష్యత్ కాలంలో నాసా చేపట్టబోయే ప్రయోగాలలో మా పాత్ర ఉంటుందని భావిస్తున్నాం. భారతీయ స్టార్టప్ కంపెనీకి ఇది దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. మా కంపెనీలో నిష్ణాతులైన నిపుణులు ఉన్నారు. వారంతా మెరుగైన సేవలు అందిస్తున్నారు. వారి కృషికి లభించిన ప్రోత్సాహం ఇది. భవిష్యత్తులో మేం కూడా మరిన్ని ప్రయోగాలు చేయాలని భావిస్తున్నాం. అవి భారతదేశ అభివృద్ధికి చెందినవై ఉంటాయని” అహ్మద్ వ్యాఖ్యానించారు.

భారతీయ కంపెనీకి గర్వకారణం..

వాస్తవానికి గతంలో నాసా తాను చేపట్టే ప్రయోగాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు అమెరికాకు చెందిన కంపెనీలపైన ఆధారపడేది. కానీ ఆ కంపెనీలు కూడా చేయలేనిది భారతీయ కంపెనీలు చేస్తున్నాయి.. ముఖ్యంగా అంతరిక్ష ఆధారిత ప్రయోగాలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు స్టార్టప్ కంపెనీలు తెరపైకి వచ్చాయి. ఈ విభాగంలో అమెరికా కంటే భారత్ లోనే ఎక్కువగా కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. అందువల్లే భారత్ వైపు ప్రపంచం చూస్తోంది. ఇందుకు నాసా మినహాయింపు కాదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular