WhatsApp Blocked : ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. మంచి అయినా.. చెడైనా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం పరిపాటిగా మారింది. తమలోని టాలెంట్‌ను చాటుకునేందుకు యువత సోషల్ మీడియానే వేదిక చేసుకుంది. ఇక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచార సాధనాలుగా సోషల్ మీడియాను ఎంచుకుంటున్నాయి. ఇందులో ప్రధానంగా వాట్సాప్ కీలకపాత్ర పోషిస్తోంది. ఎక్కువ మందికి ఒకేసారి సమాచారం చేసే వేదికగా వాట్సాప్ మారింది. దీంతో ప్రస్తుతం వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల్లో వాట్సాప్ లేకుండా పనులు జరగడం లేదు. వాట్సాప్ ద్వారా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కనెక్ట్ అవ్వడం సులభం అయింది. అయితే కొంతమంది ఇష్టంలేని, నచ్చని వారి వాట్సాప్‌ను బ్లాక్ చేస్తున్నారు. కానీ ఈ విషయం ఎదుటి వారికి తెలియడం లేదు. ఉదాహరణకు మన వాట్సాప్ నంబర్ ఎవరైనా బ్లాక్ చేస్తే ఆ విషయం మనకు తెలియదు. మనకు సమాచారం రాకపోతే.. ఎవరూ పంపడం లేదని అనుకుంటాం. అయితే కొన్ని ట్రిక్స్ ద్వారా ఎవరెవరు బ్లాక్ చేశారో సులభంగా తెలుసుకోవచ్చు.
– బ్లాక్ చేస్తే ఇవి కనపడవు..
మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే చాట్ విండోలో లాస్ట్ సీన్ కనబడదు. అలాగే ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నారో, లేదో వంటివి మీకు తెలియదు. అలాగే మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి లేటెస్ట్ ప్రొఫైల్ ఫొటో కనబడదు. అలాగే బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్ చేస్తే కేవలం ఒక్క టిక్ మార్క్ మాత్రమే వస్తుంది. రెండు టిక్ మార్కులు రావు. బ్లాక్ చేసిన యూజర్‌కు మీరు ఎప్పటికీ వాట్సాప్ కాల్ చేయలేరు. పైన చెప్పిన అన్నీ సూచనలు కనిపిస్తే ఆ వ్యక్తి బ్లాక్ చేసినట్టు అర్థం చేసుకోవాలి. అయితే పూర్తిగా నిర్ధారించుకోలేం. ఎందుకంటే సదరు వ్యక్తి తన వాట్సాప్ సెట్టింగ్స్‌లో ప్రైవసీ సెట్టింగ్స్‌లో పైన పేర్కొన్న సెట్టింగ్స్ కూడా పెట్టుకుని ఉండొచ్చు.
– అపోహ పడే అవకాశం..
ఇదిలా ఉంటే కొన్నిసార్లు బ్లాక్ చేయకపోయినా ఈ సంకేతాలు కనిపిస్తాయి. అలా ఎందుకు జరుగుతుందంటే.. ఎవరైనా తమ చివరిసారిగా చూసిన , ఆన్‌లైన్ స్థితిని డిసేబుల్ చేసి ఉండవచ్చు. లేదా వారి ఇంటర్నెట్ కనెక్షన్‌తో సమస్యలను కలిగి ఉండవచ్చు. అయితే, ఈ సంకేతాలలో అనేకం చూసినట్లయితే బ్లాక్ చేసినట్లు భావించాలి.