Smart Phone: ఫోన్ ఎక్కువ రోజులు పాడు కాకుండా ఉండాలంటే

Smart Phone: మనలో చాలా మంది మొబైల్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లతోనే చాలా మంది కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్లతోనే ఉంటున్నారు. మనుషులతో మాట్లాడటం తగ్గిపోయింది. ఎవరు చూసినా ఫోన్లలోనే మాట్లాడుకుంటున్నారు. లేదంటే చాటింగులు చేసుకుంటున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియా గ్రూపులు రావడంతో నిరంతరం ఫోన్లతోనే ఉంటున్నారు. ఏదైనా మాట్లాడాలన్నా కుదరడం లేదు. పని చెబుతామన్నా కాదంటున్నారు. అంతలా ఫోన్ […]

Written By: Srinivas, Updated On : March 2, 2023 2:13 pm
Follow us on

To keep phone long time

Smart Phone: మనలో చాలా మంది మొబైల్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లతోనే చాలా మంది కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్లతోనే ఉంటున్నారు. మనుషులతో మాట్లాడటం తగ్గిపోయింది. ఎవరు చూసినా ఫోన్లలోనే మాట్లాడుకుంటున్నారు. లేదంటే చాటింగులు చేసుకుంటున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియా గ్రూపులు రావడంతో నిరంతరం ఫోన్లతోనే ఉంటున్నారు. ఏదైనా మాట్లాడాలన్నా కుదరడం లేదు. పని చెబుతామన్నా కాదంటున్నారు. అంతలా ఫోన్ కు ఆకర్షితులయ్యారు.

ఎక్కువ కాలం..

ఈ నేపథ్యంలో మనం వాడే ఫోన్ ఎక్కువ కాలం నిలవాలంటే మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఏ వస్తువు అయినా మనం చూసుకున్నట్లుగానే మన్నుతుంది. మంచిగా చూసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది. లేదంటే కొంత కాలానికి టాటా చెప్పేస్తుంది. మన ఫోన్ పది కాలాల పాటు మనతో ఉండాలంటే కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. రోజుకు ఎక్కువ సార్లు చార్జింగ్ పెడితే ఫోన్ తొందరగా పాడవుతుంది. 20 శాతం కన్నా తక్కువ చార్జింగ్ ఉన్నప్పుడే చార్జింగ్ పెట్టాలి. అంతేకాని చీటికి మాటికి చార్జింగ్ పెడితే ఫోన్ త్వరలోనే రిపేర్ కు వెళ్లడం ఖాయం.

ఎక్కువ స్టోరేజీ..

ఫోన్ లో ఎక్కువ స్టోరేజీ ఉంచుకోవడం కూడా సురక్షితం కాదు. పనికొచ్చేది పనికి రానిది అన్ని యాప్ లను ఉంచుకుంటే ఫోన్ కు ఇబ్బంది ఏర్పడుతుంది. మొబైల్ వేగంగా పనిచేయాలంటే క్లౌడ్ స్టోరోజీ, హార్డ్ డిస్క్ వాడితే ప్రయోజనం ఉంటుంది. ఫోన్ ను ఇష్టమొచ్చిన విధంగా ఆపరేట్ చేయకూడదు. దానికి సున్నితమైన విధంగా వాడితే మన్నికగా నిలుస్తుంది. మనకు ఇబ్బందులు తీసుకురాదు. అంతేకాని నాకే ఉంది ఫోన్ అని విచ్చలవిడిగా వాడితే త్వరలోనే మరమ్మతుకు వెళ్లడం జరుగుతుంది.

Also Read: Tirumala Face Recognition: తిరుమలలో ఫేస్ రీడింగ్.. ఇక అక్కడికి వెళ్లడం కష్టమేనా

జాగ్రత్తలు

ఇంకా ఫోన్ కు వైరస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వెరిఫైడ్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం ఉత్తమ. ఏపీకే ఫైల్, బ్లూ టూత్ ఫైల్స్ తీసుకుంటే వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఫోన్ వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఏవేవో సినిమాలు డౌన్ లోడ్ చేసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే ఫోన్ వేడవువుతుంది. దీంతో కూడా డేటా గల్లంతయ్యే ప్రమాదముంటుంది. ఫోన్ ను సున్నితంగా వాడుకుంటే అది మనకు కొన్ని సంవత్సరాల పాటు మన్నికగా ఉంటుంది. లేదంటే కొంత కాలానికి తన సేవలను రద్దు చేసుకుంటుంది.

రీస్టార్ట్

మన ఫోన్ ను అప్పుడప్పుడు రీస్టార్ట్ చేయాలి. ఇలా వారానికి ఒకసారైనా రీస్టార్డ్ చేస్తే దానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. బాగా నడిచేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఫోన్ లేని వాడు కనిపించడం లేదు. చిన్నదో పెద్దదో ఫోన్ మాత్రం కచ్చితంగా వాడుతున్నారు. కాకపోతే స్మార్ట్ ఫోన్లు వాడే వారు కొంత జాగ్రత్తగా ఉంటేనే అవి మనకు సహకరిస్తాయి. ఇక చిన్న ఫోన్లు ఎలా వాడినా ఫర్వాలేదు. వాటితో పెద్దగా ఇబ్బందులు ఉండవు. స్మార్ట్ ఫోన్లతోనే సమస్యలు వస్తాయి. అందుకే వాటిని వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే సమస్యలే వస్తాయి.

Also Read: Guruvaram: గురువారం ఏ పనులు చేయకూడదో తెలుసా?